హైదరాబాద్

అప్రమత్తంగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోజుకి 150 ప్రాంతాల్లో ఫాగింగ్ చేయాలి
నవంబర్ వరకు వ్యాధి నివారణపై దృష్టి
అంటువ్యాధులపై కమిషనర్ డీకే ఆదేశం
దోమల నివారణ చర్యలు మెరుగుపడాలని సూచన

**************************

అసలే వర్షాకాలం.. ఆపై వాతావరణంలో అనూహ్యమైన మార్పులు చేసుకోవటంతో అంటువ్యాధులు ప్రబలకుండా జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులను కమిషనర్ దాన కిషోర్ ఆదేశించారు. గ్రేటర్ పరిధిలో దోమల నివారణ చర్యలు చేపట్టేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎంటమాలజీ విభాగం పనితీరుపై డీఎంహెచ్‌ఓ, జిల్లా మలేరియా అధికారులతో కలిసి సోమవారం కమిషనర్ సమీక్ష నిర్వహించారు. నవంబర్ మాసం ముగిసే వరకు దోమల ద్వారా వ్యాధులు ప్రబలే అవకాశముందని, రెండు నెలల విస్తత్రస్థాయిలో దోమల నివారణ, ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. గతంలో డెంగీ, మలేరియా కేసులు నమోదైన బస్తీల్లో ముందస్తుగా పెరిత్రియం స్ప్రేను ముమ్మరం చేయాలని ఆదేశించారు. తరుచూ మలేరియా, డెంగీ వ్యాధులు నమోదైన ప్రాంతాలైన హయత్‌నగర్, మలక్‌పేట, చాంద్రాయణగుట్ట, చార్మినార్, రాజేంద్రనగర్, మెహిదీపట్నం, కార్వాన్, అంబర్‌పేట, మూసాపేట, కుత్బుల్లాపూర్ తదితర సర్కిళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఎక్కడా కూడా నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఓవర్‌హెడ్ ట్యాంక్‌లు, సంపులు, నల్లా గుంతలతో పాటు డ్రమ్‌లు, డబ్బాలు, కుండలు, టైర్లలో నీరు నిల్వకుండా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలని అన్నారు. నవంబర్ నెలాఖరు వరకు నిరంతరంగా లార్వా నివారణ కార్యక్రమాలను చేపట్టడంతో పాటు అంటువ్యాధుల బారిన పడుకుండా ఉండేందుకు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. నగరంలోని 1800 పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. దోమల నివారణ కోసం జీహెచ్‌ఎంసీ వద్ద ఉన్న 150 పోర్టబుల్, పది ఫాగింగ్ మిషన్లు, వాహానాల ద్వారా ప్రతిరోజు కనీసం 150 కాలనీలు, బస్తీల్లో ఫాగింగ్ నిర్వహించాలని సూచించారు. మై జీహెచ్‌ఎంసీ యాప్, డయల్ 100, జీహెచ్‌ఎంసీ కాల్ సెంటర్, ఈ-మెయిల్, వాట్సప్ తదితర ప్రచార మాధ్యమాల ద్వారా దోమల బెడద, అంటువ్యాధులపై అందే ఫిర్యాదుల పట్ల వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. చైతన్య కార్యక్రమాల్లో టౌన్‌లెవెల్ ఫెడరేషన్లు, స్లమ్ లేవెల్ ఫెడరేషన్లతో పాటు కాలనీ సంక్షేమ సంఘాలను కూడా భాగస్వాములను చేయాలని కమిషనర్ సూచించారు.