హైదరాబాద్

నియంతను గద్దెదించుదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాచారం: తెలంగాణలో నియంత పాలకులను గద్దెదించాలని తెలంగాణ జన సమితి ఆధ్యక్షుడు ఆచార్య కోదండరాం విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఓయూ దూర విద్యాకేంద్రం ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ‘పల్లెలకు పొదాం కుటుంబ పాలనను తరిమికొడదాం’ సదస్సులో ముఖ్య అతిధులుగా కోదండరాం, చాడ వెంకట్ రెడ్డి, పెద్దిరెడ్డి, శ్రావణ్ సుధాకర్ పాల్గొన్నారు. గ్రామాల్లో విద్యార్థులు గ్రామ మ్యానిఫెస్టోని తయారు చేసి విద్యార్ధుల, రైతులు సమస్యలను ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు అందజేయాలని యువతకు సూచించారు. కార్యక్రమంలో నాగయ్య, గోవర్ధన్, మానవతా రాయ్, పుల్లరావు యాదవ్, బాలక్ష్మీ, వెంకటేష్ చౌహాన్ పాల్గొన్నారు.

మున్నూరు కాపు హాస్టల్ అభివృద్ధికి చర్యలు
కాచిగూడ, సెప్టెంబర్ 25: కాచిగూడ మున్నూరుకాపు విద్యార్థి వసతి గృహంను ఎండోమెంట్ పరిధి నుంచి తొలగించాలని తెలంగాణ మున్నూరుకాపు మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొండ దేవయ్య ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు విజప్తి చేశారు.
మంగళవారం మున్నూరుకాపు విద్యార్థి వసతి గృహంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్ మ్యాడం వెంకట్రావ్‌ను కాచిగూడలోని ట్రస్ట్ కార్యాలయంలో కలిసి అభినందనలు తెలిపారు. మున్నూరుకాపు హాస్టల్ ఎండోమెంట్ పరిధిలో ఉండడంవల్ల ఎలాంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టలేక పోతున్నామని వివరించారు. ఎండోమెంట్‌ను నుంచి తొలగిస్తే విద్యార్థులకు మరిన్ని మెరుగైన సేవలందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో భూమయ్య, శ్రావణ్, గొపిశెట్టి ప్రమోద్, ఆకుల నర్సింగ్ రావు, చెలిమెల ప్రదీప్ పాల్గొన్నారు.