హైదరాబాద్

నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్: త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించడంతో హైదరాబాద్ జిల్లా ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్ అధికారులను ఆదేశించారు. బుధవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో శాసన ఎన్నికల ప్రవర్తన నియమావాలి, మీడియా మానిటరింగ్, సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు తదితర అంశాలపై రిటర్నింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో దేశవ్యాప్తంగా దృష్టి హైదరాబాద్‌పై ఉందని, మీడియా సంస్థలతో పాటు రాజకీయ పార్టీలు, ఇతర సంస్థలు ఇక్కడ జరిగే ఎన్నికలను ఆసక్తిగా గమనించనున్నాయని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా పకడ్బందీగా ఎన్నికల నిర్వహన కొనసాగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల నిర్వహనపై స్వంత అభిప్రాయాలకు తావులేకుండా ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమించే సంఘటనలు ఎదురైతే వాటిని వెంటనే విడియో లేదా ఫోటోలు తీయాల్సి ఉంటుందని తెలిపారు. తీసిన వీడియో, ఫొటోలను ఎన్నికల సంఘం త్వరలో అందుబాటులోనికి తేనున్న ఈ-విజిల్ యాప్‌లో అప్‌లోడ్ చేయడం ద్వారా వెంటనే చర్యలు ఉంటాయని చెప్పారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులు ఏ రాజకీయ పార్టీకి, అభ్యర్థికి అనుకూలంగా వ్యవహరించకుండా పూర్తిగా నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఎన్నికల్లో నామినేషన్ వేసే జనరల్ అభ్యర్థులకు రూ.10వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.5వేలు డిపాజిట్‌గా నిర్ణయించిందని వివరించారు.
ఈవీఎం, వీవీ ప్యాట్‌లపై
విస్తృత అవగాహన
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు, నూతనంగా ప్రవేశపెడుతున్న వీవీ ప్యాట్‌ల గురించి ఓటర్లకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ఇందు కోసం జిల్లా మరిన్ని అవగాహన కేంద్రాలను పెంచుతున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో మొదటిసారిగా ఈవీఎంపై ఓటు వేసిన అనంతరం ప్రత్యేక డిస్‌ప్లేలో తాము వేసిన అభ్యర్థికే ఓటు నమోదు అయిందా లేదా అనే దానిని నిర్ధారించుకునే అవకాశం కల్పించినందున దీనిపై ప్రతి ఓటరుకు అవగాహన కల్పించాల్సిన బాధ్యతను ఖచ్చితంగా నెరవేర్చాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో ఒక మొబైల్ వాహనాన్ని సిద్ధం చేసినట్టు చెప్పారు. బూత్ స్థాయిలో అవగాహన చేపట్టే లక్ష్యంతో ప్రతి వార్డులో అవగాహన నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.
వౌలిక సదుపాయాలు
పోలింగ్ కేంద్రాల్లో వౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని దాన కిషోర్ అధికారులకు సూచించారు. రిటర్నింగ్ అధికారి పరిధిలోని ప్రతి పోలింగ్ కేంద్రాన్ని ప్రత్యేకంగా సందర్శించి అక్కడి లోటుపాట్లను గమనించి వాటిని సరిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా వివిధ కారణాలతో ఓటింగ్ దూరంగా ఉంటున్న దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్టు చెప్పారు. పోలింగ్ కేంద్రం వద్ద తప్పకుండా రూఫ్ నిర్మించడం, బ్రెయిలీ లిపితో కూడిన ఈవీ ఎంల ఏర్పాటు, అవసరమైతే సహాయకులు, వీల్ చైర్స్ సిద్దం చేస్తామని తెలిపారు. ఈసారి ఎన్నికలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు బూత్ స్థాయిలో ప్రణాళికలు రూపొందించాలని ఎన్నికల సంఘం ఆదేశించిన నేపథ్యంలో ఆ దిశగా ఏర్పట్లపై దృష్టి సారించాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ఆయా కేంద్రాల వద్ద భద్రత ఏర్పాట్లు, అభ్యర్థుల ఖర్చు, పెయిడ్ న్యూస్ ఆర్టికల్స్‌పై సైతం దృష్టి సారించాలని సూచించారు. చిన్నపాటి సంఘటనకు తావులేకుండా ఎన్నికలు నిర్వహించేలా ప్రతి అధికారి బాధ్యతయుతంగా వ్యవహరించాలని కోరారు.