హైదరాబాద్

హోర్డింగ్ ఎక్కిన టీఆర్‌ఎస్‌వి నేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్: ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్‌ఎస్ టికెట్‌ను నియోజకవర్గ ఇన్‌చారి మనె్న గోవర్దన్ రెడ్డికి కేటాయించాలని ఎనిమిది మంది కార్యకర్తలు హోర్డింగ్ ఎక్కారు. మొదటి నుంచి ఖైరతాబాద్ టికెట్ కేటాయింపు సందిగ్ధంలో ఉంది. ఖైరతాబాద్ టికెట్‌ను విజయా రెడ్డి, మనె్న గోవర్ధన్ రెడ్డి, దానం నాగేందర్ ఆశిస్తున్నారు. కాగా అధిష్ఠానం దానం వైపే మొగ్గు చూపుతుందని తెలుసుకున్న మనె్న తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. సోమవారం పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళనకు యత్నించగా పోలీసులు అడ్డుకొని అక్కడి నుంచి పంపించివేశారు. ఘర్షణలో మనె్న అనారోగ్యానికి గురికావడంతో ఆసుపత్రికి తరలించారు. తమ నాయకుడ్ని విస్మరిస్తున్నారని ఆవేదనకు గురైన టీఆర్‌ఎస్‌వీ నాయకులు ప్రేమ్, జావేద్, విశాంత్, రాకేష్, అద్నాన్, సమీర్, చందు, మహేష్.. ఖైరతాబాద్ ప్రధాన కూడలిలోకి చేరుకొని సమీపంలోని భవనంపై ఉన్న హోర్డింగ్ ఎక్కారు. మనె్నకు టికెట్ కేటాయించాలని నినాదాలు చేశారు. గమనించిన స్థానికులు వెంటనే సమాచారాన్ని పంజాగుట్ట పోలీసులకు అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఫైర్ అధికారులను సంఘటన స్థలానికి రప్పించి హోర్డింగ్ ఎక్కినవారిని కిందికి దించేందుకు పోలీసులు ఒకవైపు ప్రయత్నాలు చేస్తుండగా, మరికొందరు నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకొని ఆందోళన చేపట్టారు. వారిని వెంటనే పోలీసులు అరెస్టు చేసి పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సుమారు నాలుగు గంటలపాటు సాగిన హైడ్రామా అనంతరం మనె్న గోవర్ధన్ రెడ్డి భార్య కవితా రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని వారిని బుజ్జగించగా వెనక్కి తగ్గడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సంఘటనతో ఖైరతాబాద్ ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు.
టికెట్ కేటాయిస్తారని నమ్మకం ఉంది: కవిత
మొదటి నుంచి పార్టీ బలోపేతానికి కృషిచేసిన మనె్న గోవర్దన్ రెడ్డికి టికెట్ కేటాయిస్తుందన్న నమ్మకం తమకు ఉందని కవిత పేర్కొన్నారు. తమను కాదని ఇతరులకు టికెట్ కేటాయిస్తే తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.