హైదరాబాద్

ఆశావహుల అసంతృప్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ముందస్తు ఎన్నికల్లో వివిధ ప్రధాన పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడిన ఆశావహుల ఆందోళనలు మంగళవారం ఉద్దృతమయ్యాయి. ముందు జాగ్రత్తగా టీడీపీ, కాంగ్రెస్, టీఆర్‌ఎస్ ఆఫీసుల ముందు అదనపు బందోబస్తును ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయమైన గాంధీభవన్ రెండు గేట్ల వద్ద పోలీసులు భారీగా మోహరించగా, గాంధీభవన్ లోపల భారీగా ప్రైవేటు సెక్యూరిటీని నియమించారు. ఖైరతాబాద్ టీఆర్‌ఎస్ టికెట్ కోసం ఆ పార్టీ నేత మనె్నం గోవర్థన్ రెడ్డి వర్గీయులు మంగళవారం ఉదయం తెలంగాణ భవన్‌ను ముట్టడించేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకుని భగ్నం చేశారు. పోలీసులు, మనె్నం వర్గీయుల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ క్రమంలో కొందరు టీఆర్‌ఎస్ కార్యకర్తలకు గాయాలు కాగా, మనె్నం గోవర్థన్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. తెలంగాణ ఉద్యమంలో ఆస్తులు అమ్ముకుని, ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన తమకు కాదని, ఉద్యమంతో సంబంధం లేని వారికి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా, ఉద్యమ నేత కేసీఆర్‌ను అవమానించే విధంగా వ్యాఖ్యలు చేసిన దానం నాగేందర్‌కు టికెట్ ఎలా ఇస్తారని ఆ పార్టీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. ఇదే రకంగా అధికార పార్టీ ఇప్పటికే ఖరారు చేసిన పలు నియోజకవర్గాల అభ్యర్థుల ప్రకటనపై పార్టీ వర్గాల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. నాంపల్లి టీఆర్‌ఎస్ టికెట్ కేటాయింపులో ఆ పార్టీ చేసిన తప్పిదం పట్ల కూడా స్థానికంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముందుగా టికెట్ ఖరారు చేస్తూ ఎం. ఆనంద్ గౌడ్ పేరు ప్రకటించిన తర్వాత నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ముమ్మరంగా ప్రచారం చేస్తున్న సమయంలో పేరు పొరపాటున ప్రకటించామని, అతని స్థానంలో సీహెచ్ ఆనంద్‌కుమార్ గౌడ్ ప్రకటించటం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. కుత్బుల్లాపూర్ టికెట్ తమకే కేటాయించాలని కొందరు ఆశావాహులు ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో ఆందోళనకు దిగారు. నగరంలోని మొత్తం 15 అసెంబ్లీ స్థానాల్లో అంబర్‌పేట, ఖైరతాబాద్ మినహా టీఆర్‌ఎస్ పార్టీ అన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఇక ప్రజాకూటమి సీట్ల సర్దుబాటు ఎటూ తేలకపోవటంతో అందులోని భాగస్వామ్య పార్టీలైన టీడీపీ, కాంగ్రెస్ పార్టీల ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అన్ని స్థానాలకు ప్రధాన పార్టీలన్నీ టికెట్లను ఖరారు చేసిన తర్వాత ఈ నిరసనలు మరింత తీవ్రమయ్యే అవకాశముంది.