హైదరాబాద్

మూడు రోజులు.. హైదరాబాద్‌లో 44 నామినేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ముందస్తు ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఊపందుకుంది. నగరంలోని అన్ని స్థానాల్లో ఇప్పటికే టికెట్లు ఖరారైన టీఆర్‌ఎస్, మజ్లిస్, బీజేపీ తదితర పార్టీలకు చెందిన అభ్యర్థులు ఒక్క బుధవారమే నగరంలోని 15 అసెంబ్లీ స్థానాలకు 12 స్థానాల నుంచి 44 నామినేషన్లను దాఖలు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారులు వెల్లడించారు. టికెట్లు ఆశించిన భంగపడినవారు కూడా ఖైరతాబాద్, అంబర్‌పేట నియోజకవర్గాల్లో ఇండిపెండెట్లుగా నామినేషన్లు సమర్పించారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో అత్యధికంగా ఎనిమిది, కంటోనె్మంట్, యాకుత్‌పురా నియోజకవర్గాల్లో ఐదు చొప్పున , సనత్‌నగర్, గోషామహల్, సికిందరాబాద్ నియోజకవర్గాల్లో నాలుగు చొప్పున, ముషీరాబాద్, అంబర్‌పేట, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో మూడు చొప్పున, మలక్‌పేట, కార్వాన్ నియోజకవర్గాల్లో రెండు చొప్పున, నాంపల్లి నియోజకవర్గంలో ఒక నామినేషన్ దాఖలైనట్లు అధికారులు తెలిపారు. చార్మినార్, చాంద్రాయణగుట్ట, బహదూర్‌పురా నియోజకవర్గాల్లో ఒక నామినేషన్ కూడా దాఖలు కాలేదు. అధికార టీఆర్‌ఎస్‌తో పాటు పలు ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులకు కూడా ముహూర్తం సెంటిమెంట్ పట్టుకుంది. బుధవారం మధ్యాహ్నం రెండున్నర నుంచి మూడు గంటల మధ్య మంచి ముహూర్తం ఉందంటూ వేద పండితులు సూచించటంతో ఆ సమయంలోనే ఎక్కువ మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. నాంపల్లి టీఆర్‌ఎస్ అభ్యర్థి సీహెచ్ ఆనంద్‌గౌడ్ కూడా ముహూర్తం బాగుందని భావించి, తాను అందుబాటులో లేకపోయినా, తన అనుచరులు, న్యాయవాదితో కలిసి నామినేషన్‌ను దాఖలు చేయించారు.
ఎవరెవరు.. ఎక్కడెక్కడి నుంచి?
ముషీరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా అనిల్‌కుమార్ యాదవ్, మలక్‌పేట టీఆర్‌ఎస్ అభ్యర్థిగా సీ. సతీష్‌కుమార్, అంబర్‌పేట స్వతంత్య్ర అభ్యర్థిగా పొన్నపాటి చిన్న లింగన్న, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా వీకే ఉపేంద్ర, టీడీపీ పార్టీ అభ్యర్థిగా వనం రమేశ్, ఖైరతాబాద్ నియోజకవర్గంలో సోషలిస్టు యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా ఇ.హేమలత, టీడీపీ అభ్యర్థిగా బీ.నర్సింహా రెడ్డి, సత్వంత్య్ర అభ్యర్థిగా ఆర్‌ఎస్ రంజిత్‌కుమార్, బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్థిగా మనె్న గోవర్దన్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. జూబ్లీహిల్స్ నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా అబ్దుల్లా ఇబ్రహీం, కాంగ్రెస్ అభ్యర్థిగా పీ. విష్ణువర్దన్ రెడ్డి, సనత్‌నగర్ నియోకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా సూరారవు సుమత్రి, టీఆర్‌ఎస్ అభ్యర్థిగా తలసాని శ్రీనివాస యాదవ్, ఇండిపెండెంటుగా ఎ.శ్రీనివాస రావు నామినేషన్లు దాఖలు చేశారు. నాంపల్లి నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా సీహెచ్ ఆనంద్‌కుమార్ గౌడ్, కార్వాన్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా టీ.జీవన్ సింగ్, గోషామహల్ కాంగ్రెస్ అభ్యర్థిగా ముఖేష్‌గౌడ్, ఇండిపెండెంట్ అభ్యర్థిగా బీవీ రమేశ్‌బాబు, యాకుత్‌పుర నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా సామ సుందర్‌రెడ్డి, శివసేన అన్యర్థిగా జమాల్‌పుర్ మహేశ్ కుమార్, మజ్లిస్ నుంచి సయ్యద్ పాషాఖాధ్రి, ఎన్‌సీపీ నుంచి ఎస్.సుజాత నామినేషన్లు సమర్పించారు. సికిందరాబాద్ నుంచి సీపీఎం అభ్యర్థిగా అనిల్ కుమార్ కుంచాల, ఇండిపెండెంట్‌గా సాయికిరణ్, బహుజన రాజ్యం పార్టీ అభ్యర్థిగా మాడ్గుల సునిత నామినేషన్లు దాఖలు చేయగా, కంటోనె్మంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎం.మన్మోహన్, స్వతంత్య్ర అభ్యర్థులుగా జీ. దయామణి, శ్రీగణేష్ నారాయణ్, నాగేశ్వర రావు గజ్జెల నామినేషన్లు సమర్పించారు. నామినేషన్ల స్వీకరణ మొదటి రోజైన ఈనెల 12 నుంచి 14వ తేదీ వరకు మొత్తం 54 నామినేషన్లు స్వీకరించినట్లు డీఈఓ దాన కిషోర్ తెలిపారు.