హైదరాబాద్

హుషారుగా నామినేషన్ల దాఖలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 16: చాంద్రాయణగుట్ట నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని ఆ పార్టీ అభ్యర్థి షహజాది తెలిపారు. ఎన్నికల్లో భాగంగా తమ నామినేషన్‌ను సమర్పించేందుకు బర్కాస్ పీలీ మజీద్ నుండి బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా బయలుదేరారు. ఈ ర్యాలీ బర్కాస్ నుంచి చాంద్రాయణగుట్ట మీదుగా వివిధ ప్రాంతాల నుంచి కొనసాగి ఫలక్‌నుమాలోని బండ్లగూడ తహశీల్దార్ కార్యాలయానికి చేరుకుంది. నామినేషన్ పత్రాలను నియోజకవర్గం రిట్నరింగ్ అధికారికి అందజేశారు. చాంద్రాయణగుట్ట నియోజకవర్గం బీజేపీ నాయకులు పెండం లక్ష్మణ్, మాదారి చంద్రశేఖర్, ఊరడి సత్యనారాయణ, కౌడి సురేందర్, జే. చిరంజీవి, నగర ఎస్సీ మోర్చ కార్యదర్శి కాటెపాగ అనీల్‌బాబు, అధ్యక్షుడు ఆశారాం సోని పాల్గొన్నారు. నియోజకవర్గం టీఆర్‌ఎస్ అభ్యర్థిగా సీతారామ్ రెడ్డి కూడా నామినేషన్ దాఖలు చేశారు.
బాలాపూర్: సొంత కోడలిని కార్పొరేటర్‌గా కూడా గెలిపించుకొని అసమర్థడు మహేశ్వరం టీఆర్‌ఎస్ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి అని, అలాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా ఎలా గెలుస్తారని రెబల్ అభ్యర్థి కొత్త మనోహర్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం కొత్త మనోహర్ రెడ్డి జిల్లెలగూడ శ్రీవెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి ర్యాలీగా వందలాది మందితో కలిసి టీఆర్‌ఎస్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు
షాద్‌నగర్ రూరల్: ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఐదవ రోజు ఒకే నామినేషన్ దాఖలైనట్లు షాద్‌నగర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం.కృష్ణ తెలిపారు. శుక్రవారం ఫరూఖ్‌నగర్ మండలం హాజిపల్లి గ్రామానికి చెందిన కేతూరి రాఘవేందర్ అనే వ్యక్తి ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖలు చేసినట్లు వివరించారు.
ఇబ్రహీంపట్నం: రాష్ట్ర శాసనసభకు జరగనున్న ఎన్నికలకు నామినేషన్ల పర్వం ఊపందుకుంది. నాలుగు రోజుల్లో ఆరు నామినేషన్లు దాఖలు కాగా, శుక్రవారం మరో మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. జాతీయ పార్టీ సమాజ్‌వాదీ తరపున పార్టీ జిల్లా అధ్యక్షుడు బొళ్ల గణేష్ ముదిరాజ్ నామినేషన్ దాఖలు చేశారు. సమాజ్‌వాదీ పార్టీ నుంచి బీ-్ఫంను తెచ్చుకున్న గణేష్ బీ-్ఫంతోనే నామినేషన్‌ను దాఖలు చేశారు. శివసేన తరపున సంరెడ్డి శివకిషన్ రెడ్డి, జైస్వరాజ్ తరపున బాలరాజ్ గౌడ్ నామినేషన్లు దాఖలు చేశారు.
కీసర: శుక్రవారం మేడ్చల్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లకు 20 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. మేడ్చల్‌లో మూడు నామినేషన్లు నవ ప్రజారాజ్యం పార్టీ నుంచి బైరపాక జేసుదాసు చక్రవర్తి, తెలుగుదేశం పార్టీ నుంచి తోటకూర అశోక్, బీజేపీ నుంచి పెద్ది మోహన్‌రెడ్డి నామినేషన్లు దాఖలు చేసారు.
జీడిమెట్ల: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే స్థానానికి ఐదవ రోజు నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం రిటర్నింగ్ అధికారి విక్టర్ వివరాలను తెలిపారు. స్వతంత్ర అభ్యర్థులుగా ముడిమాల రాము గౌడ్, కే.వసంత రాఘవ, వెలగపూడి కిరన్ కుమార్ వేయగా కాంగ్రెస్ నుంచి కూన శ్రీశైలం గౌడ్ మరో నామినేషన్‌ను దాఖలు చేశారు.
ఉప్పల్: నామినేషన్ల పర్వంలో భాగంగా శుక్రవారం ఉప్పల్ అభ్యర్థులుగా నలుగురు తమ నామినేషన్ల పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి కే.కృష్ణ శేఖర్‌కు అందజేశారు. ఉప్పల్ శ్రీనగర్ కాలనీకి చెందిన బీ.రాజు స్వతత్ర అభ్యిర్థిగా, రామంతాపూర్ శ్రీనగర్ కాలనీకి చెందిన టీ.బాల్‌రాజ్ న్యూ ఇండియా పార్టీ నుంచి, మల్లాపూర్ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన కే.విజయ్ కుమార్ స్వతంత్ర ఆభ్యర్థిగా, కాప్రా జీఆర్ రెడ్డి నగర్‌కు చెందిన జగదీష్ చౌదరి శివసేన పార్టీ నుంచి రెండో సెట్ నామినేషన్ పత్రాలను అందజేశారు.
మేడ్చల్: మేడ్చల్ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి కొంపల్లి మోహన్ రెడ్డి శుక్రవారం నామినేషన్ దాఖలు సందర్భంగా ఆ పార్టీకి చెందిన నాయకులు పట్టణంలో గడిమైసమ్మ తల్లి ఆలయంలో, డిపో సమీపంలోని ఏడుగుళ్ల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాయకులు జగన్ గౌడ్, కిషన్ రావు, ప్రభాకర్ రెడ్డి, లక్ష్మణ్, రాజేశ్ గౌడ్, సర్వేశ్వర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, సంతోష్, మహేశ్, రాజు, యాదగిరి, మని, శంకర్, నితిన్ పాల్గొన్నారు.