హైదరాబాద్

నాడు సహచరులు.. నేడు ప్రత్యర్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సనత్‌నగర్ నియోజకవర్గంలో పోటీ రసవత్తరంగా మారింది. గత ఎన్నికల్లో ఒకే పార్టీలో సహచరులుగా ఉన్న ఇద్దరు నేతలు ఇక్కడ పోటీ పడుతున్నారు. టీఆర్‌ఎస్ తరపున అపద్దర్మ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ బరిలో ఉండగా, టీడీపీ నుంచి అనూహ్యాంగా పోటీకి దిగిన కూన వెంకటేశ్ గౌడ్‌లు గత ఎన్నికల్లో ఒకే పార్టీలో మంచి సహచరులు. అప్పట్లో కూన వెంకటేశ్ గౌడ్ సికిందరాబాద్ నుంచి పోటీ చేసేందుకు తలసాని పూర్తి అండదండలు అందించారు. కానీ, ఇపుడు తలసానికి అనూహ్యంగా కూన రాజకీయ ప్రత్యర్థిగా మారాడు. పైగా ఒకరి విజయానికి ఒకరు పరస్పరం సహకరించుకున్న వీరిద్దరు ఇపుడు విజయం కోసం పోటీ పడుతుండటం ఆసక్తికరంగా మారింది. బీసీ సామాజికవర్గానికే చెందిన వీరిద్దరు తమ సామాజికవర్గానికి చెందిన ఓట్లను చేజిక్కించుకునేందుకు వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. ఇప్పటికే ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు పాదయాత్రలు, సభలు, సమావేశాలు నిర్వహిస్తూ తలసాని ముందంజలో ఉండగా, కూన ఇంకా ప్రచారాన్ని ముమ్మరం చేయాల్సి ఉంది. గత 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచే టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి, టీఆర్‌ఎస్ అభ్యర్థిపై గెలుపొందిన తలసాని.. పార్టీ ఫిరాయింపు, టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రధాన ప్రచారాస్త్రాలుగా సంధించేందుకు టీడీపీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి. సనత్‌నగర్‌ను ఈసారి కైవసం చేసుకునేందుకు టీడీపీ పావులు కదుపుతోంది. అదే తరహాలో తాను చేసిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లి, నగరంలో అసలు టీడీపీ పార్టే లేదన్న సంకేతాలిచ్చేందుకు తలసాని ప్రయత్నాలు చేస్తున్నారు. వేల సంఖ్యలో ఉన్న సెటిలర్ ఓటర్లను ఆకర్షించే అంశంపై టీడీపీ ప్రధానంగా దృష్టి సారించింది. సెటిలర్ ఓట్లున్నా, అవి జయాపజయాలను నిర్ణయించేటంత కీలకమేమీ కాదని టీఆర్‌ఎస్ భావిస్తోంది.
ప్రముఖుల ప్రచారానికి సన్నాహాలు
ఈ నియోజకవర్గంలో టీడీపీ తరపున ప్రచారానికి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే ఇంటింటికీ ప్రచారాన్ని చేపట్టిన అభ్యర్థి సుహాసినితో కలిసి ముందుగా హరికృష్ణ తనయులు, ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం నిర్వహించిన తర్వాత తుది దశగా ఈ నెలాఖరులో గానీ, వచ్చే నెల 1వ తేదీన గానీ బాబు ప్రచారం నిర్వహించేందుకు వీలుగా ఆ పార్టీ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. టీఆర్‌ఎస్ తరపున మంత్రి కేటీఆర్ ఈ నియోజకవర్గంలో ప్రత్యేకంగా ప్రచారం నిర్వహించిన తర్వాత, కేసీఆర్‌చే ప్రత్యేక ప్రచారాన్ని పార్టీ శ్రేణులు సన్నద్దమవుతున్నాయి. ప్రముఖుల ప్రచార విషయంలో ఒకరు తర్వాత మరొకరు నిర్వహించాలని భావిస్తున్నారు.

వీరేందర్ గౌడ్‌కు ప్రజా నీరాజనాలు
ఉప్పల్, నవంబర్ 21: మహాకూటమి బలపర్చిన టీడీపీ ఉప్పల్ ఎమ్మెల్యే తూళ్ల వీరేందర్ గౌడ్ నియోజకవర్గంలో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్ నేతలు, కార్యకర్తలతో హబ్సిగూడ డివిజన్‌లో ఇంటింటికీ ప్రచారాన్ని నిర్వహించారు. నవరంగ్‌గూడ మజీద్ ఆవరణలో అబ్ధుల్ కలాం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ ములాఖత్ కార్యక్రమానికి హాజరైన వీరేందర్ గౌడ్ సమక్షంలో ముస్లిం మైనారిటీ యువకులు యూసుఫ్, సయ్యద్, మహమ్మద్, రియాజ్, కైసర్ వందలాది మంది టీడీపీలో చేరారు. కాలనీల్లో నిర్వహించిన ఇంటింటికీ కార్యక్రమంలో మహిళలు, యువకులు పాల్గొని వీరేందర్‌కు నీరాజనాలు పలికి ఆశీర్వదించారు. చిల్కానగర్ డివిజన్‌లోని ఆదర్శనగర్‌లో పొదుపు మహిళలు పద్మ, వసంత, స్వాతి, లావణ్య, సరిత మాజీ హోం శాఖ మంత్రి దేవేందర్ గౌడ్ సమక్షంలో టీడీపీలో చేరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు రఘుపతి గౌడ్, వెంకన్న గౌడ్, పబ్బతి శేఖర్ రెడ్డి, కోల రవి కుమార్ గౌడ్ పాల్గొన్నారు.