హైదరాబాద్

తొలి దశలో గుర్తిస్తే అలర్జీ,అస్తమా సమస్యలకు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముషీరాబాద్, ఎప్రిల్ 10: అలర్జీ, అస్తమా రుగ్మతలను తొలిదశల్లో గుర్తిస్తే సరైన శాస్రీయ చికిత్స ద్వారా బాధితులు సాధారణ జీవితం గడిపేందుకు తోడ్పడటమే తమ ఆశయమని శ్వాస ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ విష్ణున్‌రావు వీరపనేని అన్నారు. ప్రపంచ అలర్జీ ఆర్గనైజేషన్ పిలుపుమేరకు ఆదివారం ఉదయం ఇందిరాపార్కువద్ద ఉచిత అవగాహన, వైద్య శిబరం నిర్వహించారు. ఈసందర్భంగా పార్కు సందర్శకులకు వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈసందర్భంగా విష్ణున్‌రావు మాట్లాడుతూ దేశంలో దాదాపు 5 కోట్ల మంది అలర్జీ- అస్తమాతో బాధపడుతున్నారని అన్నారు. ఊపిరితిత్తులు, చర్మం, కళ్లు, జీర్ణకోశాలకు ఈ అలర్జీ కలగవచ్చని అన్నారు. ఎంతకీ వదలని జలుబు, చికాకు పెట్టే తుమ్ములు, ముక్కుదురద, కళ్ల దురద, ఒళ్లు దురద, దగ్గు, ఆయాసం, విరేచనాలు అలర్జీ వల్ల వచ్చే లక్షణాలని తెలిపారు. పుప్పొడి, ఇంటిదుమ్ము, ధూళి, బూజు, పెంపుడు జంతువుల వెంట్రుకలు, పాలపొడి, పొగ, పెర్‌ఫ్యూమ్‌లు, సెంట్‌వాసనలు, అగరబత్తీ, సాంబ్రాణి పొగలు వంటి వాటిపై ప్రజలలో అవగాహన కల్గించేందుకు తాము విరివిగా ప్రచార, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలర్జీ వ్యాధిని తొలిదశలలోనే గుర్తించటం, సరియైన చికిత్స నందించటానికి, నూతన పరికరాలను ఉపయోగించటం తదితర శాస్ర్తియ విషయాలలో యువ వైద్యులకు శిక్షణ ఇచ్చే వర్క్‌షాపులను శ్వాస ఫౌండేషన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.