హైదరాబాద్

ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ రాయుళ్ల జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాచారం: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే బెట్టింగ్ రాయుళ్ల బెట్టింగ్‌కు తెరలేపారు. పోలింగ్‌కు ముందు వరకు స్థబ్దులుగా ఉన్న పందెం రాయుళ్లు బెట్టింగ్ జోరును కొనసాగిస్తున్నారు. గతంలో నగరానికే పరిమితమైన ఫలితాలపై బెట్టింగ్ నేడు శివారు గ్రామాలకు పాకింది. హైదరాబాద్ నగరానికి అతికొద్ది దూరంలో ఉన్న ఇబ్రహీంపట్నంలో బెట్టింగ్ జాడ పురివిప్పుతోంది. నియోజకవర్గంలోని యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాల్లో బెట్టింగ్‌రాయుళ్లు కొత్త తరహా బెట్టింగ్‌కు తెరలేపారు. గతంలో గెలిచి, పోటీనిచ్చే వారిపైనే బెట్టింగ్ కాసేవారు. ప్రస్తుతం పరిస్థితులు మారిపోవడంతో గెలిచే వారికి వచ్చే ఓట్ల శాతం, పోలయ్యే ఓట్లపై బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు. గ్రామాల్లో నలుగురు ఒక్కచోట చేరిన చోట ఒకరికొకరు ప్రతీ సవాల్ విసురుతూ తమ నేత గెలుస్తారంటే తమ నేత గెలుస్తారన్న చర్చకు దారితీస్తోంది. దీనిని క్యాష్ చేసుకునేందుకు బెట్టింగ్ రాయుళ్లు రంగంలోకి దిగుతున్నారు. తమకు అందివచ్చే సర్వేలను అసరా చేసుకుంటూ బెట్టింగ్‌కు ఊతమిస్తున్నారు. పూర్తిగా గ్రామీణ వాతావరణం ఎక్కువగా ఉన్న మండలాలైన యాచారం, మంచాల మండలాల్లోనూ బెట్టింగ్ జోరు కొనసాగుతుంది. పోలింగ్ పూరె్తైన వెంటనే కొంత మంది గుట్టుగా బెట్టింగ్‌కు పాల్పడుతున్నారని తెలుస్తోంది. గత శాసనసభ, సార్వత్రిక, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ నియోజకవర్గంలో బెట్టింగ్ భారీగానే సాగిందన్న వార్తలు వినిపించాయి. గతంలో కొంత మంది బెట్టింగ్ రాయుళ్లను పోలీసులు అరెస్టు చేసిన దాఖలాలు లేకపోలేదు. మరో మూడు రోజుల్లో ఎన్నికల ఫలితాలు విడుదలయ్యేంత వరకు బెట్టింగ్ జోరు కొనసాగే అవకాశం ఉంది. బెట్టింగ్ రాయుళ్ల పై పోలీసులు సైతం నిఘా పెట్టారు. బెట్టింగ్‌కు పాల్పడే వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తున్నారు.