హైదరాబాద్

కొత్త ఆశ ఫలించేనా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ముందస్తు ఎన్నికల్లో భాగంగా నగరంలోని పలు స్థానాల నుంచి మొట్టమొదటి సారిగా ఎన్నికల బరిలో నిలిచిన కొత్త అభ్యర్థుల్లో కొందరు గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. సిట్టింగ్ స్థానాల్లో మళ్లీ తాము విజయం సాధిస్తామా? అన్న బెంగ తాజాగా మాజీలను వెంటాడుతోంది. వీరిలో ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి, సనత్‌నగర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి తలసాని శ్రీనివాసయాదవ్, అంబర్‌పేట బీజేపీ కిషన్‌రెడ్డి, సికిందరాబాద్ పద్మారావు, ముషీరాబాద్ డా.కే.లక్ష్మణ్, గోషామహల్ నుంచి టీ, రాజాసింగ్‌లు మళ్లీ తాము తమ స్థానాలను పదిలం చేసుకుంటామా? అంటూ పోలింగ్ సరళిపై తర్జనభర్జన చేస్తున్నారు. అంబర్‌పేటలో ద్విముఖ పోటీ ఉండటం, ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ కారణంగా కిషన్‌రెడ్డికి కలిసొచ్చే అవకాశముంది. త్రిముఖ పోటీ ఉన్న ఖైరతాబాద్‌లో కూడా ఫలితం ఇలాగే వచ్చే అవకాశముంది. ఇక్కడ ఏ అభ్యర్థి గెలిచినా, రెబెల్‌గా బరిలో దిగిన అభ్యర్థి చీల్చే ఓట్లే కారణమన్న విశే్లషణ ఉంది. ముషీరాబాద్‌లో త్రిముఖ పోటీ ఉండటం, పొత్తుల్లో భాగంగా ఇప్పటి వరకు టీడీపీ పార్టీ ఎవరికి మద్దతిస్తే ఆ పార్టీ గెలుపొందటం ఆనవాయితీగా వస్తుండటంతో కాంగ్రెస్ అభ్యర్థి అనీల్‌కుమార్ యాదవ్ గెలుపుపై కొండంత ఆశతో ఉన్నారు. ఈ సారి ఎన్నికల్లో బీజేపీ తరపున మలక్‌పేట అభ్యర్థిగా ఆలే జితేంద్ర, చార్మినార్ నుంచి ఉమా మహేందర్ కూడా మైనార్టీ ఓట్ల చీలకతో తమ విజయం సునాయాసమని భావిస్తున్నారు. చాంద్రాయణగుట్ట నుంచి షహజాది, ఇక్కడి నుంచే కాంగ్రెస్ అభ్యర్థిగా ఇసామిస్రీ, యాకుత్‌పురా నుంచి సామ శ్యాంసుందర్‌రెడ్డి, చార్మినార్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మహ్మద్ గౌస్, అదే పార్టీ తరపున ముషీరాబాద్ నుంచి అనీల్‌కుమార్ యాదవ్, జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా నుంచి శ్రీ్ధర్‌రెడ్డి, సికిందరాబాద్ బీజేపీ అభ్యర్థిగా బండపెల్లి సతీష్, అంబర్‌పేట టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కాలేరు వెంకటేశ్, నాంపల్లి నుంచి సిహెచ్ ఆనంద్‌కుమార్‌గౌడ్‌లు మొట్టమొదటి సారిగా శాసనసభ ఎన్నికల బరిలో నిలిచారు. అధికార పార్టీకి చెందిన అభ్యర్థులు ప్రభుత్వం చేసిన అభివృద్ధి తమను గెలిపిస్తుందని, కూటమికి చెందిన అభ్యర్థులు ప్రభుత్వంపై ఉన్న ప్రజావ్యతిరేకతే తమకు గెలుపును సాధించి పెడుతుందన్న భావనలో ఉన్నారు. వీరిలో మలక్‌పేట నుంచి ఆలే జితేంద్ర, చార్మినార్ ఉమా మహేందర్, ముషీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి అనీల్‌కుమార్ యాదవ్‌లు గెలుపుపై ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. మజ్లీస్ సిట్టింగ్ స్థానాలైన నాంపల్లి, మలక్‌పేట, యాకుత్‌పురాల్లో విజయమేమీ అంతా సులువయ్యే పరిస్థితుల్లేవు.గోషామహల్, ఖైరతాబాద్, ముషీరాబాద్‌లలో బీజేపీకి, సికిందరాబాద్, సనత్‌నగర్‌లలో టీఆర్‌ఎస్‌కు ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. కొత్త వారి ఆశలు ఎంత వరకు ఫలిస్తాయి? సిట్టింగ్‌లు ఎంత మంది తమ స్థానాలను కాపాడుకుంటారో తెలవాలంటే 11వరకు వేచి ఉండాలి.