హైదరాబాద్

ఫలించిన మజ్లిస్ వ్యూహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మజ్లిస్‌కి కంచుకోట అయిన పాతబస్తీలోని వివిధ ప్రాంతాల్లో ముందస్తు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంకాను మోగించింది. ప్రత్యర్థుల ఎత్తులు, జిత్తులను చిత్తు చేస్తూ గతంలో ఉన్న ఏడు సీట్లను పదిలపరుచుకుంది మజ్లిస్. ఈసారి ఎన్నికలు మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీకి సవాల్‌గా మారాయి. దీంతో ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించి సిట్టింగ్‌లకే మరోసారి అవకాశం కల్పించి ఎన్నికల బరిలోకి దింపారు. గ్రేటర్ హైదరాబాద్‌లో మరిన్ని సీట్లను పెంచుకోవాలన్న ఆలోచనతో మజ్లీస్ పార్టీ అధినాయకులు దృష్టి సారించినా రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో విజయం సాధించలేకపోయారు. చార్మినార్‌కు యాకుత్‌పురా ఎమ్మెల్యే ముంతాజ్‌ఖాన్‌ను, చార్మినార్ ఎమ్మెల్యే సయ్యద్ పాషా ఖాద్రీని యాకుత్‌పురా అభ్యర్థులుగా బరిలోకి దింపారు. చాంద్రాయణగుట్ట నుండి అక్బరుద్దీన్ ఓవైసీ, కార్వాన్ నుంచి కౌసర్ మహ్మద్ ఖాన్, మలక్‌పేట్ నుంచి అహ్మద్ బీన్ అబ్దుల్లా బలాల, నాంపల్లినుంచి మిరాజ్ జాఫర్ హుస్సేన్, బహదుర్‌పురా నుండి మోజంఖాన్ పోటీ చేసి ప్రత్యర్థులపై ఘనవిజయం సాదించారు. ఎన్నికల బరీలోకి దిగిన మజ్లిస్ అభ్యర్థులకు అధిక శాతం బిజేపీ అభ్యర్థులు ప్రత్యర్థులుగా నిలిచారు. ఎన్నికల ఫలితాలు వెల్లడించిన తరుణంలో మజ్లిస్ శ్రేణులు విజయోత్సవాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా గెలుపొందిన మజ్లిస్ అభ్యర్థులు మాట్లాడుతూ తమకు ఓటు వేసి గెలిపించిన అన్ని వర్గాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్‌పైనే ప్రత్యేక దృష్టిసారించిందని చెప్పవచ్చు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఒక పార్లమెంట్ సీటుతోపాటు ఏడు ఎమ్మెల్యే సీట్లు, 45 కార్పొరేటర్ సీట్లను దక్కించుకుంది.
పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ పార్టీ పగ్గాలు చేపట్టిన్నప్పటి నుంచి అసెంబ్లీ, పార్లమెంట్‌లో సీట్ల సంఖ్యను పెంచుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే అన్ని వర్గాల ప్రజలకు పార్టీలో సభ్యత్వం కల్పించి పార్టీ కార్యక్రమాలను విస్తరిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన మజ్లిస్ ఆధ్వర్యంలో దారుసలాంలో ఈనెల 12వ తేదీన విజయోత్సవ సభను నిర్వహించనున్నది. రాత్రి ఏడు గంటలకు జరుగనున్న ఈ సభలో పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీతో పాటు ఎన్నికల్లో గెలుపొందిన ఏడుగురు ఎమ్మెల్యేలు అక్భరుద్దీన్ ఓవైసీ, మోజంఖాన్, అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల, మీరాజ్ జాఫర్ హుస్సేన్, ముంతాజ్‌ఖాన్, కౌసర్ మహ్మద్‌ఖాన్, పాషాఖాద్రి పాల్గొంటారు.

కౌటింగ్ కేంద్రం వద్ద గట్టి బందోబస్తు
ఖైరతాబాద్, డిసెంబర్ 11: ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు. డీసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణలో కేంద్రాల వద్ద రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలను మోహరించారు. మూడు అంచల్లో భద్రతను ఏర్పాటుచేసి లోనికి వస్తున్న ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే లోనికి అనుమతి ఇచ్చారు. కౌటింగ్ ముగుస్తున్న సందర్భంలో స్టేడియం వద్దకు భారీగా నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. బయటనుంచి టీ ఆర్ ఎస్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయసాగారు. పలుమార్లు పోలీసులు వారిని దూరంగా పంపేందుకు యత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఇక దానం నాగేందర్ కౌటింగ్ కేంద్రం వద్దకు రాగానే కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ లోనికి వచ్చేందుకు యత్నించారు. పోలీసులు అప్రమత్తమై వారిని అడ్డుకున్నారు. పాసులు ఉన్నవారే లోనికి రావాలంటూ ఆదేశించి కొద్దిసేపు గేటును మూసివేశారు.అనంతరం అక్కడికి చేరుకున్న ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్‌ను సైతం కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించలేదు.టీఆర్‌ఎస్ అభ్యర్ధిగా భారీ మెజారిటీతో దానం నాగేందర్ విజయం సాధించడంతో పార్టీ కార్యకర్తలు సంబురాలు జరుపుకున్నారు.