హైదరాబాద్

ప్రతాప్‌నగర్ అభివృద్ధికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్: బడుగు, బలహీన వర్గాలు అధికంగా నివసించే ప్రతాప్‌నగర్ అభివృద్ధికి కృషి చేస్తానని మాజీ మంత్రి దానం నాగేందర్ పేర్కొన్నారు. శనివారం ప్రతాప్‌నగర్ నివాసి, ఏమ్మార్పీఎస్ యువజన అధ్యక్షుడు నల్ల శివమాదిగ ఆధ్వర్యంలో స్థానికులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని వర్గాల వారు తనను ఆదరించడం వల్లే గెలుపు సాధ్యమైందని అన్నారు. స్థానికంగా సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే అధికారులతో చర్చించి వాటిని పరిష్కరిస్తానని చెప్పారు. సన్మానించిన వారిలో ప్రభ, జంగమ్మ, చింటు, అశ్విన్, మహేష్, నరేష్ ఉన్నారు.
బహుముఖ ప్రజ్ఞాశాలి కొలకలూరి ఇనాక్
కాచిగూడ, డిసెంబర్ 15: బహుముఖ ప్రజ్ఞాశాలి పద్మశ్రీ డా.కొలకలూరి ఇనాక్ అని తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డా.నందిని సిధారెడ్డి అన్నారు. కొలకలూరి ఇనాక్ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న సందర్భంగా అభినందన సభ సచ్చిదానంద కళాపీఠం, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నందని సిధారెడ్డి మాట్లాడుతూ, కొలకలూరి ఇనాక్ సాహిత్యంలో అన్ని ప్రక్రియల్లో రచనలు చేశారని, ఆయన రచనలు సమాజానికి ఎంతో స్ఫూర్తినిచ్చాయని తెలిపారు. ఆచార్య టీ.గౌరిశంకర్ సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, సాహితీ కిరణం సంపాదకుడు డా.పొత్తూరి సుబ్బారావు, కవి రమణ వెలమకన్ని, విమల సాహితీ సమితి అధ్యక్షుడు జెల్ది విద్యాధర రావు, సాహితీవేత్త సాధన నరసింహాచార్య, సంస్థ అధ్యక్షుడు రత్నాకర శర్మ పాల్గొన్నారు.