హైదరాబాద్

అన్ని డివిజన్లలో ‘అమరజ్యోతి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ 23వ వర్ధంతిని పురస్కరించుకుని 18న నగరంలో నగరంలోని అన్ని మున్సిపల్ వార్డులు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్త్రృతంగా కార్యక్రమాలను నిర్వహించాలని పార్టీ శ్రేణులకు టీడీపీ నగర అధ్యక్షుడు ఎంఎన్ శ్రీనివాస్ రావు పిలుపునిచ్చారు. బుధవారం సిటీ టీడీపీ ఆఫీసులో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్టీఆర్ వర్థంతి రోజున ఉదయం రసూల్‌పుర ఎన్టీఆర్ విగ్రహాం నుంచి ఎన్టీఆర్ ఘాట్ వరకు ప్రత్యేకంగా ‘అమరజ్యోతి’ ర్యాలీను నిర్వహించనున్నట్లు, దీనికి సినీ నటుడు బాలకృష్ణ హాజరవుతున్నారని, పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నా యుడు కూడా హాజరయ్యే అవకాశమున్నట్లు తెలిపారు. ర్యాలీ అనంతరం ఘాట్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించనున్నట్లు, కార్యక్రమానికి తెలుగు తమ్ముళ్లు అత్యధిక సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. బడుగు, బలహీనవర్గాల్లో రాజకీయంగా చైతన్యం తీసుకువచ్చిన ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నగరంలోని అన్ని ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్‌కు నివాళి అర్పించి, ప్రజలకు అవసరమయ్యే సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. అన్ని నియోజకవర్గాలు, డివిజన్లలో అన్నదాన కార్యక్రమాలు, వస్త్రాలు, పండ్ల పంపిణీ వంటి సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎంఎన్ తెలిపారు.

పదోన్నతి పొందిన పోలీసులకు అభినందన
హైదరాబాద్, జనవరి 16: హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేసి అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్లుగా పదోన్నతి పొందిన పది మంది ఉద్యోగులను సీపీ అంజనీ కుమార్ అభినందించారు. బషీర్‌బాగ్‌లోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఏఎస్‌ఐలను అభినందించి విధులను సక్రమంగా నిర్వహించి నగర పోలీస్ విభాగానికి పేరు ప్రతిష్టలు తేవాలని అన్నారు. పదోన్నతి పొందిన వారిలో బీ.రామకృష్ణ రావు (మలక్‌పేట్ పోలీస్టేషన్), ఈ.ఈదయ్య (నల్లకుంట), ఏసీవై స్వామి (మహంకాళీ), పీ.పాండు రంగారాజు (సీఎస్‌డబ్ల్యు), మహ్మద్ ముక్తార్ (హుమాయున్‌నగర్), మహ్మద్ అశ్రాఫ్ (డబ్ల్యుపీఎస్- సీసీఎస్), జి.వాసుదేవ రెడ్డి (టీటీఐ), సయ్యద్ హమీదుల్లా (ట్రాఫీక్ పీఎస్ సైఫాబాద్).