హైదరాబాద్

నాలాల పూడికతీతలో రూ.6 కోట్లు ఆదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 15: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతి సంవత్సరం వేలాది కోట్లతో బడ్జెట్ తయారు చేస్తున్న బడ్జెట్‌లో జరుపుతున్న కేటాయింపుల ప్రకారం నిధులు వెచ్చించటం లేదన్న విషయం ఇదివరకే బట్టబయలైన సంగతి తెలిసిందే. నగరం గ్రేటర్‌గా రూపాంతరం చెందక ముందు నాలాల్లో పూడికతీత పనుల కోసం ఏటా రూ.6 కోట్లను వెచ్చించిన కార్పొరేషన్ కాల క్రమేనా ఈ నిధులను రూ. 26 కోట్లకు పెంచింది. ఈ సారి కూడా ఎండకాలం ముగిసేలోపు నాలాల్లో పూడికతీత పనులకు రూ. 26 కోట్లను కేటాయించారు. కొన్ని చోట్ల టెండర్లు ఖరారై తూతూమంత్రంగా పనులు ప్రారంభం కాగా, మరికొన్ని చోట్ల టెండర్లు అర్దాంతరంగా ఆగిపోగా, మరికొన్ని చోట్ల పనులు ఖరారైనా నేటికీ ప్రారంభించలేదు.
ప్రతి వర్షాకాలానికి ముందే నాలాల్లో పూడికతీత పనులు ముగిస్తామంటూ హడావుడి చేస్తూ అధికారులే కొందరు కాంట్రాక్టర్ల అవతారమెత్తి పనులను చేజిక్కించుకుని నిధులను జేబులు నింపుకున్నారనే ఆరోపణలున్నాయి. ప్రతి సంవత్సరం ఏప్రిల్, మే నెలాఖరుకల్లా నగరంలోని అన్ని నాలాల్లోని పూడికను తొలగించాలంటూ పదిహేనేళ్ల క్రితమే కిర్లోస్కస్ కమిటీ స్పష్టమైన సిఫార్సులు జారీ చేసినా, అధికారులు వీటిని ఏ ఒక్క సంవత్సరం కూడా ఖచ్చితంగా అమలు చేసిన దాఖలాల్లేవు. ఇరవై అడుగుల లోతుండే భారీ నాలాల్లో అడుగుభాగం నుంచి సుమారు పదిహేను అడుగుల ఎత్తు వరకు నేటికీ నాలాల్లో బురద, చెత్తాచెదారం దర్శనమిస్తుందంటే అధికారులు ఏ స్థాయిలో పూడికతీత పనులు చేపడుతున్నారో అంఛనా వేసుకోవచ్చు. రోడ్ నెంబర్ 12 చౌరస్తాలోని పెన్షన్ ఆఫీసు పక్కనే ఉన్న బల్కాపూర్ నాలాల్లో పైకి తేలుతూ కన్పిస్తున్న చెత్తాచెదారమే అధికారులు పనితీరుకు నిదర్శనంగా చెప్పవచ్చు. నాలా పైభాగంలోనూ భారీగా చెత్తాచెదారం కన్పిస్తున్నందున, గత వర్షాకాలంలో వానాల కురవకపోవటంతో ఈ నాలాల్లో చెత్తాచెదారం, పూడికను తొలగించలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలో ఐదు భారీ నాలాలు, మరో పద్నాలుగు మధ్య తరహా, 22 రెండు చిన్న తరహా నాలాలున్నాయి. రూపాంతరం చెందిన తర్వాత శివార్లలోని పలు నాలాలు కూడా గ్రేటర్ బల్దియా పరిధిలోకి రావటంతో ఈ నాలాల్లోని పూడికతీత పనులకు ఏటేటా పెంచుతూ నేడు రూ. 26 కోట్లకు వ్యయం పెరిగింది. కొందరు గ్రేటర్ ఇంజనీర్ల పుణ్యమాని ప్రతి ఏటా అడ్డదారిలో ఈ నాలా పూడికతీత పనులను చేజిక్కించుకునే కాంట్రాక్టర్లు నాలాల్లో ఇరువైపులా పేరుకుపోయిన చెత్తాచెదారం, కాగితాలను తూతూమంత్రంగా తొలగించి పనులు పూర్తి చేసినట్లు రికార్డులు సృష్టించి బిల్లులు డ్రా చేసుకుంటున్నట్లు ఇదివరకే ఆరోపణలు వెల్లువెత్తినా, వీటిపై ఎలాంటి విచారణకు సైతం ఆదేశించకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. పనులు కేటాయించిన తర్వాత అసులు కాంట్రాక్టర్లు పనులు చేస్తున్నారా లేదా? చేస్తుంటే నాలాల్లోని అడుగుభాగం వరకు పేరుకుపోయిన చెత్తా, పూడిక, బురదను తొలగించారా లేదా? అనే విషయాన్ని కనీసం నిర్ధారించుకోకుండానే అధికారులు గుడ్డిగా బిల్లులు మంజూరు చేస్తున్నట్లు వాదనలున్నాయి.
మంత్రి చొరవతో తగ్గిన వ్యయం
ఎప్పటికపుడు ప్రతి ఏటా నాలాల్లో పూడికతీత పనుల పేరిట కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్న జిహెచ్‌ఎంసికి ఈ సారి మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కె. తారకరామారావు చొరవతో రూ. 6 కోట్ల వరకు ఆదా అయింది. ఈ సంవత్సరం పూడికతీత పనులకు రూ. 26 కోట్లను కేటాయించారు. గత సంవత్సరం నాలాల్లోని తీసిన పూడికను ప్రత్యేకంగా డంపింగ్ యార్డుకు తరలిస్తున్నామంటూ కోట్లలో అధికారులు ఖర్చులు చూపేవారు. ఈ విషయంలో చాకచక్యంగా వ్యవహారించిన మంత్రి కెటిఆర్, ఎక్కడి తీసిన పూడికను అక్కడి నుంచి స్థానిక ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌కు తరలించి, రొటీన్ ప్రక్రియలో భాగంగానే డంపింగ్ యార్డుకు తరలించాలని ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేయటంతో వ్యయంగా నిర్ణయించిన రూ. 26 కోట్లు కాస్త రూ. 20 కోట్లకు తగ్గింది.
ఈ వ్యవహారంపై మంత్రి మరింత లోతుగా పరిశీలన జరిపి, పూడికతీత పనులను అకస్మికంగా తనిఖీ చేస్తే మరెన్నో అక్రమాలు బయటపడే అవకాశాలున్నాయి.