హైదరాబాద్

ఒకే ఒక్క కాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : స్వచ్ఛ సర్వేక్షణ్ 2019 సర్వే..అంటే అదేంటో మనకు పనికిరాని సబ్జెక్టు అని సామాన్యులు భావిస్తుంటారు. అంతెందుకు స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నగరానికి మెరుగైన ర్యాంకు సాధించేందుకు నగరంలో పారిశుద్ద్య, స్వచ్ఛ కార్యక్రమాల నిర్వహణలో పెద్దన్నయ్య పాత్ర పోషించాల్సిన బల్దియాలో నేటికీ కొందరు అధికారులు, మరికొందరు పాలక మండలి సభ్యుల్లో కూడా ఇదే భావన ఉంది. కానీ, అందరూ ‘స్వచ్ఛ’పై అవగాహన వంతులై, ఎవరికి వారే తమ సొంత పనిగా 1969 టోల్‌ఫ్రీ నెంబర్‌కు చేసే ఒకే ఒక్క కాల్ చేస్తే, అది సర్వేక్షణ్‌లో మన నగరానికి మెరుగైన ర్యాంకును తెచ్చి పెట్టే అవకాశముంది. ఇక డబ్బులు పెట్టి కాల్ ఎందుకు చేయాలని భావించే వారికి ఆ బెంగ అవసరం లేదు. ఎందుకంటే మీరు మిస్డ్ కాల్ చేసినా, తిరిగి అటువైపు నుంచి కాల్ వస్తోంది. ఆ కాల్‌లో స్వచ్ఛ సర్వేక్షణ్‌కు సంబంధించి అడిగే ఏడు ప్రశ్నలకు జాగ్రత్తగా, సానుకూలంగా జవాబులు చెబితే చాలు మన నగరంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచే అవకాశముంది. ఈ సర్వే దేశవ్యాప్తంగా సమారు ఐదు వేల మహానగరాలు, పట్టణాల్లో జరుగుతుంది. ఇందులో భాగంగా త్వరలోనే హైదరాబాద్ నగరానికి కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ్భారత్ మిషన్ ప్రతినిధుల బృందం నగరానికి రానుంది. ఈ బృందం నగరంలో అమలవుతున్న పారిశుద్ద్య పనులు, స్వచ్ఛ కార్యక్రమాలకు సంబంధించి జీహెచ్‌ఎంసీ నుంచి నివేదికలను స్వీకరించటంతో పాటు క్షేత్ర స్థాయిలో అమలయ్యే పారిశుద్ద్య, స్వచ్ఛ కార్యక్రమాలను తనిఖీ చేసి, ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్‌ను కూడా తీసుకునే అవకాశమున్నట్లు ప్రతి ఒక్కరూ గుర్తించి, జాగ్రత్తగా సమాధానాలు చెప్పాలని బల్దియా అధికారులు సూచిస్తున్నారు.
ప్రజలు సహకరించాలి
* మేయర్ బొంతు రామ్మోహన్
సర్వేక్షణ్‌లో నగరాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు నగరవాసులు సహకరించాలని మేయర్ బొంతు రామ్మోహన్ సూచించారు. సర్వేక్షణ్ సర్వే సందర్భంగా శుక్రవారం అదనపు కమిషనర్ రవికిరణ్‌తో కలిసి మెడికల్ ఆఫీసర్లతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. మేయర్ మాట్లాడుతూ ఈనెల 31వ తేదీలోపు స్వచ్ఛ ప్రతినిధుల బృందం స్వచ్ఛతపై నగరవాసులను నేరుగా కలిసి ప్రశ్నలు అడిగే అవకాశముందని తెలిపారు. ప్రజలు నేరుగా 1969 టోల్‌ఫ్రీకి, స్వచ్ఛసర్వేక్షణ్-2019డాట్ ఓఆర్‌జీ/సిటిజన్ ఫీడ్‌బ్యాక్ అనే వెబ్‌సైట్‌ను కూడా సంప్రదించి తమ అభిప్రాయాలను వెల్లడించేలా ప్రజలను చైతన్య పర్చాలని సూచించారు.