హైదరాబాద్

చాంపియన్ రాజస్తాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ హైదరాబాద్‌ల సంయుక్త ఆధ్వర్యంలో నగరంలో నిర్వహించిన 6వ రాజీవ్ గాంధీ ఆలిండియా అండర్-19 జాతీయ డే అండ్ నైట్ టీ-20 ఫెడరేషన్ కప్ లీగ్ క్రికెట్ చాంపియన్‌షిప్ (2019) ట్రోఫీని రాజస్తాన్ జట్టు కైవసం చేసుకుంది. పోటీలకు ఆతీధ్యమిచ్చిన హైదరాబాద్ ద్వితీయ స్థానంలో నిలిచి రన్నర్స్ ట్రోపీని చేజిక్కించుకుంది. నగరంలో జరుగుతున్న ఈ టోర్నమెంట్ గ్రాండ్ ఫైనల్ లాల్‌బహదూర్ స్టేడియంలో జరిగింది. ఫైనల్ మ్యాచ్‌లో హైదరాబాద్‌తో రాజస్తాన్ జట్టు తలపడింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 19.2 ఓవర్లలో 114 పరుగులు చేసి ఆలౌటైంది. హైదరాబాద్ జట్టులో బ్యాటింగ్‌లో రాణించిన సంహిత్ రెడ్డి 62 పరుగులు చేసి అర్థ సెంచరీ పూర్తి చేశాడు. రాజస్తాన్ బౌలింగ్‌లో ప్రణవ్ 24 పరుగులిచ్చి 3వికెట్లు తీసుకోగా, ఈశ్వర్ సంఖాలే, రాజమని ప్రసాద్‌లు చేరి రెండేసి వికెట్లు తీసుకున్నారు. 115 పరుగుల విజయ లక్ష్యాంతో బ్యాటింగ్ బరీలోకి దిగిన రాజస్తాన్ 17.2 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసి విజయ లక్ష్యాన్ని సునాయసంగా అధిగమించింది. బ్యాటింగ్‌లో రాణించిన యాష్ గుప్తా 61 పరుగులు చేసి అర్థ సెంచరీ పూర్తి చేశాడు. అంతకు ముందు జరిగిన మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో రాజస్తాన్ ఆరు వికెట్ల తేడాతో తమిళనాడుపై గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న తమిళనాడు 17.4 ఓవర్లలో రాజస్తాన్ బౌలింగ్‌ను తట్టుకోలేక 73 పరుగుల వద్ద కుప్పకూలింది. రాజస్తాన్ బౌలర్ సుమెన్‌దాస్ కేవలం 22 పరుగులిచ్చి 5వికెట్లు తీసుకున్నాడు.
కాగా ఈశ్వర్ సంఖాలే, ప్రణార్‌లు చేరి రెండేసి వికెట్లు తీసుకున్నారు. రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో హైదరాబాద్ 72 పరుగుల తేడాతో క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ హైదరాబాద్‌పై విజయం సాధించింది. బ్యాట్స్‌మన్ సుమిత్ రెడ్డి 62, గౌసర్ 67, అక్సారి 33 పరుగులు చేయడంతో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 180 పరుగులు సాధించింది. సీఎఫ్‌హెచ్ బసలర్లు కేవీ.కార్తీకేయ, దుర్గేష్ చేరి మొడేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం జరిగిన బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి తెలంగాణ అసెంబ్లీ ప్రతిపక్ష పార్టీ నేత మల్లు బట్టి విక్రమార్క ముఖ్యఅతిథిగా విచ్చేసి గెలుపొందిన జట్లకు ట్రోఫీలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి యువతరం వారికి నచ్చిన క్రీడల్లో శిక్షణ పొంది గోప్ప క్రీడాకారులుగా ఎదాగాలన్నారు. కార్యక్రమంలో ఆలీండి క్రికెట్ ఫెడరేషన్ చైర్మన్, మాజీ రజ్యసభ సభ్యుడు వి.హనుమంత్‌రావు, సీఎఫ్‌ఐ అధ్యక్షుడు సయ్యద్ సాదిక్ పాషా, ప్రధాన కార్యదర్శి అమర్‌జిత్ కుమార్,
నేడు శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు
షాబాద్, జనవరి 20: మండల పరిధిలోని దైవాలగూడ గ్రామంలో శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక హోమం, పూజలు నిర్వహిస్తున్నట్లు దేవాలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగి నేటికి 41వ రోజు పూర్తి అయిన సందర్భంగా మండల పూజ, హోమం జరుగుతున్నట్లు వివరించారు. ఉదయం 10 గంటలకు స్వామివారికి అభిషేకం, హోమం, పూజలు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల ప్రజలు వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని కోరారు, కార్యక్రమాల అనంతరం అన్నదానం ఉంటుందన్నారు.