హైదరాబాద్

గణితం అంటే భయం పోగొట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 15: గణితం అంటే భయం పోయినపుడే విద్యార్ధులు ఏ శాస్త్రంలోనైనా రాణించగలుగుతారని గణిత శాస్త్ర నిపుణుడు వివిఎన్‌ఎస్‌ఎస్ రామ్ పేర్కొన్నారు.గణితం అంటే ఒట్టి సంఖ్యలే కాదని, పరిధి చాలా ఎక్కువని, గణితమంటే వివిధ అంశాల మధ్య సంబంధాలు చూడగలగడమని, తర్కం, అనుప్రయోగ సామర్ధ్యం, సృజనాత్మకత, ఒక ఆత్మపరిశీలన అని వివరించారు. గణిత ప్రతిభా పాటవాలను ఎదుర్కోవడానికి సరైన సన్నివేశాలను కల్పించి వారి నైపుణ్యాలను పెంపొందించడం ఒక్కటే మార్గమని అన్నారు. ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో ఒక సందర్భంలో గణితాన్ని ఎదుర్కోవడమేగాక, దాని ఆధారంగా ఒక భావనను ఏర్పరచుకుంటారని చెప్పారు. హైదరాబాద్‌లో మాథ్స్ అకాడమిని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణితంలో ప్రతి ఒక్కరూ ప్రజ్ఞాపాటవాలను సాధించేలా తాము కృషి చేస్తున్నట్టు చెప్పారు. గణితంలో ప్రజ్ఞ అంటే ఒక డజను గణిత సమస్యలను సులువుగా పరిష్కరించడమో , సాంకేతిక పరిజ్ఞానంలో నిపుణతనో, సూత్రాలను గుర్తుపెట్టుకోవడమో, సంఖ్యలపై పట్టు కలిగి ఉండటమో, బీజగణిత సూత్రాలను సిద్ధాంతాలను నిరూపించడమో కానే కాదని చెప్పారు. మనిషి ఆశక్తత, సంకల్పం, సౌందర్యాసక్తత అతను వ్యక్తం చేసే గణితాభిప్రాయాల ద్వారా తెలుస్తుందని, తర్కంతో కూడిన సహజ సామర్ధ్యం, విశే్లషణ, నిర్మాణం, సాధారణీకరణ గణితంలోని వౌలిక అంశాలుగా ఉంటాయని చెప్పారు. గణితంలో ప్రావీణ్యం సాధించడం ద్వారా సహజజ్ఞానం, అంతర్దృష్టి, లోకజ్ఞానం, తర్కం, సృజనాత్మకత, వౌలికత, నవనీత దృగ్గోచరత, ఊహాత్మకత, సాధరణీకరించే సామర్ధ్యం, సమస్యను వివిధ దృక్కోణాల నుండి చూడటం, విభిన్నమైన పరిష్కారాలు అలవడుతాయని చెప్పారు. తేలికగా గణితం నేర్చుకోవడంపై ఈ నెల 18 నుండి హబ్సిగూడ స్వాగత్ గ్రాండ్‌లో తరగతులు నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు. ఇతర వివరాలకు 9440667775పై సంప్రదించవచ్చని అన్నారు.