హైదరాబాద్

నారాయణ కళాశాల డీన్‌ను విధుల నుంచి తొలగించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్: ఉద్యోగులను మాసికంగా లైంగికంగా వేధిస్తున్న నారాయణ కళాశాల డీన్‌ను కఠినంగా శిక్షించాలని కళాశాల అధ్యాపకులు పేర్కొన్నారు. సోమవారం తార్నాక నారాయణ కళాశాల ఎదుట మహిళా అధ్యాపకురాలిని వేధిస్తున్నారని ఆరోపిస్తూ పలువురితో కలిసి కళాశాల డీన్‌ను నిలదీసింది. దీంతోకళాశాల వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎంతోమంది మహిళా అధ్యాపకుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా ఎదురించిన వారిని ఎలాంటి నోటీసులు లేకుండా 12మందిని విధుల నుంచి తొలగించారని ఆరోపించారు. బాధితురాలు ధర్నాకు దిగడంతో అధ్యాపకులు ఓయు క్యాంపస్ నుంచి విద్యార్థి సంఘాల నేతలు పెద్దయెత్తున తరలివచ్చి మద్దతు ప్రకటించారు. అనంతరం ఓయు పోలీస్‌స్టేషన్‌కు తరలివెళ్లి సదరు డీన్‌పై ఫిర్యాదు చేశారు. తమను లైంగికంగా వేధించిన నిందితునిడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విద్యార్థి నిరుద్యోగ ఫ్రంట్ చైర్మన్ దయాకర్, కల్వకుర్తి ఆంజనేయులు, గుండు కరుణాకర్, పీడీఎస్‌యు రంజిత్, నామునాయక్ పాల్గొన్నారు.