హైదరాబాద్

నగరంలో వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముషీరాబాద్, ఏప్రిల్ 17: ప్రచండ భానుడి ప్రతాపానికి అల్లాడిన నగర ప్రజలు ఆదివారం సాయంత్రం కురిసిన వర్షంతో ఊపిరి పీల్చుకున్నారు. వేసవితాపానికి, వడగాల్పులు, ఉక్కబోతతో కుతకుతలాడిన నగర ప్రజలను వర్షం చల్లబరిచింది. నగరంలోని అంబర్‌పేట, ఉస్మానియా యూనివర్శటీ, బోడుప్పల్, కాప్రా, చర్లపల్లి, ఈసిఐఎల్, ముషీరాబాద్, చిక్కడపల్లి, ఆర్టీసిక్రాస్‌రోడ్డు, బషీర్‌బాగ్, నాంపల్లి, సికింద్రాబాద్, ప్యాట్నీ, పద్మారావ్‌నగర్, ఆబిడ్స్, కోఠి, నాంపల్లి, లక్డీకాపూల్, వనస్థలిపురం తదితర ప్రాంతాలలో ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లాలో కూడా పలు చోట్ల భారీ వర్షం కురిసింది. చేవెళ్ల, షాబాద్ మండలాలలో వర్షం కురిసింది. భానుడి భగభగలతో అల్లాడిన ప్రజలు కాస్త ఊరటచెందారు. ఆదివారం సెలవు దినం, సాయంత్రం కాస్త కుటుంబ సభ్యులతో సరదాగా షికారు కెళ్దామని భావించిన వారికి వర్షం కారణంగా నిరాశే ఎదురయ్యింది. నగరంలోని ఆయా ప్రాంతాలలో కురిసిన వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముషీరాబాద్ నియోజక వర్గంలోని గాంధీనగర్, ఆశోక్‌నగర్, భోలక్‌పూర్, పద్మశాలికాలని ప్రాంతాలలో మోకాళ్లలోతు నీరు నిలిచింది. వాహనదారులు, పాదచారులు ఇబ్బందులకు గురయ్యారు. ఎప్పడిలాగే పలు ప్రాంతాలలో ట్రాఫిక్ స్తంబించింది. ప్రదాన కూడళ్లలో కటౌట్లు నేలకొరిగాయి. హిమాయత్‌నగర్‌లోని మినర్వా హోటల్ సమీపంలో ఒక ట్రాన్స్‌ఫార్మర్ దగ్ధమయ్యింది. తీవ్రంగా మంటలు చెలరేగటంతో స్థానికులు బయాందోళనలకు గురయ్యారు. నగర శివారులోని ఘట్‌కేసర్ మండల పరిధిలో గ్రామాలలో వర్షం బీభత్సం సృష్టించింది. విద్యుత్, స్తంబాలు, హోర్డింగ్‌లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంబాలు నేలకొరగటంతో వాహనదారులు పరుగులు తీశారు.పలు ప్రాంతాలో గాలిదుమారం తీవ్రంగా వీయటంతో ఇళ్లడై రేకుల కప్పులు ఎగిరిపోయాయి. పు ప్రాంతాలలో విద్యుత్ స్తంబాలు నేలకొరగటంతో కరెంట్ సరఫరా నిలిచిపోయి అందకారం నెలకొంది.రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలోని మేడిపల్లిలో పిడుగుపాటుతో ఒకరు మృత్యృవాతపడ్డాడు.