హైదరాబాద్

అక్రమ నల్లా కనెక్షన్లపై కొరడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: జలమండలి ఆదాయానికి గండికొడుతూ దర్జాగా అక్రమంగా నీటి కనెక్షన్లు కలిగిన వారి భరతం పట్టేందుకు జలమండలి సిద్ధమయింది. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని నీటి వృథాను సైతం అరికట్టేందుకు అధికారులు సమయాత్తం అవుతున్నారు. అక్రమ నీటి కనెక్షన్లను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. వేసవి కాలం కావడంతో అక్రమ నీటి కనెక్షన్ల కారణంగా నీటి సరఫరాలో కలుషిత జలాలు కలిసే అవకాశం ఉంటుందని పలువురు నిపుణులు చెబుతున్నారు. అక్రమ నీటి కనెక్షన్ ఇచ్చే వ్యక్తి ఎలాంటి అనుభవం లేకుండా నీటి పైప్‌లైన్‌కు రంధ్రాలు చేయడంతో నీటి పైప్‌లైన్‌కు పక్కనే ఉండే డ్రైనేజీ నీరు చేరే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అక్రమ నీటి కనెక్షన్లపై జలమండలి విజిలెన్స్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ముమ్మరంగా దాడులు నిర్వహిస్తున్నారు. అక్రమ నీటి కనెక్షన్ కలిగినవారిపై ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించినందుకు, దొంగతనంగా నీటి కనెక్షన్ తీసుకున్నందుకు క్రిమినల్ కేసులు నమోదు చేస్తోంది. జలమండలి చీఫ్ విజిలెన్స్ అధికారి పర్యవేక్షణలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో విజిలెన్స్ సిబ్బంది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అక్రమ నీటి కనెక్షన్లు కలిగినవారిపై కేసులు సైతం నమోదు చేస్తున్నారు. తాజాగా బుధవారం జలమండలి విజిలెన్స్ అధికారులు వెంగళ్‌రావు నగర్ సెక్షన్ పరిధిలోని మధురా నగర్ కాలనీలోని మెసర్స్ శరణ్ అపార్ట్‌మెంట్‌కు అక్రమ నీటి కనెక్షన్ కలిగి ఉన్నట్లు గుర్తించారు. జలమండలి ఎండీ ఆదేశాల మేరకు అక్రమ నల్లా కనెక్షన్ తొలగించడంతో పాటు సంబంధిత భవన యాజమానిపై సంజీవరెడ్డినగర్ పోలీస్టేషన్‌లో ఐపీసీ 269, ఐపీసీ 430, ఐపీసీ 379 సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. జలమండలి చీఫ్ విజిలెన్స్ అధికారి ఎం.రవిచందన్ రెడ్డి మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మెయింటనెన్స్ విభాగం డివిజన్‌ల పరిధిలోని అన్ని సెక్షన్ల పరిధిలో విజిలెన్స్ దాడులు ముమ్మరం చేస్తామన్నారు. వేసవి కాలం సందర్భంగా ఈ దాడులను మరింత పకడ్బందీగా చేపడతామన్నారు. అక్రమ నీటి కనెక్షన్ తీసుకునే ముందు నగరంలో జలమండలి సరఫరా చేస్తున్న నీటి పైప్‌లైన్‌కు ఏ మాత్రం డ్యామేజ్ అయినా నీటి సరఫరా కలుషితం అయ్యో ప్రమాదం ఉందని, దీంతో అనేక మందికి ఇబ్బందులు కలిగే ఆవకాశం ఉందని వివరించారు. జలమండలి విజిలెన్స్ పోలీస్టేషన్ అధికారి పీ.తిరుపతి సిబ్బందితో కలిసి ప్రతి రోజు ముమ్మరంగా వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారని చెప్పారు. జలమండలి విజిలెన్స్ సిబ్బంది తనిఖీలో ప్రధానంగా నల్లా కనెక్షన్ కమర్షియలా లేదా డోమెస్టిక్ అన్న కోణంలో విచారించి తుది నిర్ణయానికి వస్తారు. ఎపుడో తీసుకున్న నల్లా కనెక్షన్ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్, దుకణాల సముదాయం వంటివి ఉంటే వెంటనే ఇంటి యాజమానికి నోటీసులు జారీ చేసి కనెక్షన్‌ను కమర్షియల్‌గా మార్చుకోవాలని సూచించామని చీఫ్ విజిలెన్స్ అధికారి తెలిపారు. ఇప్పటి వరకు అనేక ప్రాంతాల్లో అక్రమ నీటి కనెక్షన్లు గుర్తించి శాఖపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు.