హైదరాబాద్

పేదరిక నిర్మూలనపై జాతీయ స్థాయి సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్: ప్రణబ్ ముఖర్జీ ఫౌండేషన్, ఇన్సిటిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ (ఐపీఇ) సంస్థల ఆధ్వర్యంలో దేశంలో పేదరికానికి కారణాలు- నిర్మూనలకై తీసుకోవాల్సిన చర్యలపై జాతీయ స్థాయి సదస్సును నిర్వహిస్తున్నట్టు ఐపీఈ డైరెక్టర్ ఆర్‌కే. మిశ్రా తెలిపారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సదస్సు కో- ఆర్డినేటర్ ప్రోఫెసర్ ఆనంద్‌తో కలిసి వివరాలను వెల్లడించారు. దేశానికి స్వాతత్య్రం వచ్చి ఏళ్లు గడుస్తున్నా పేదరిక నిర్మూలన ఆశించిన స్థాయిలో జరగలేదని అన్నారు. ధనికులు మరింత ధనికులుగా అవుతుండగా,పేదలు మరింతగా పేదరికంలో నెట్టబడుతున్నారని వాపోయారు. మనుషుల మధ్య పెరుగుతున్న ఆర్థిక వ్యత్యాసాలు సమాజంలో అంశాతికి కారణం అవుతున్నాయని అన్నారు. వీటన్నింటిపై సమగ్రంగా చర్చించేందుకే ‘టూవర్డ్స్ పీస్, హార్మని, హ్యాపినెస్ :ట్రాన్సిషన్ టూ ట్రాన్స్‌ర్‌మేషన్’ అనే అంశంపై శామీర్‌పేటలోని ఐపీఈ క్యాంపస్‌లో రెండు రోజుల పాటు సదస్సును నిర్వహిస్తున్నట్టు చెప్పారు. సదస్సుకు ముఖ్య అతిధులుగా రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాజేశ్వర్ తీవారి, కేంద్ర ప్రభుత్వ మాజీ సెక్రెటరీ ఆర్.హెచ్ ఖాజా, సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ చైర్మన్ రాధకృష్ణ తదితరులు హాజరై ప్రసంగిస్తారని తెలిపారు. సమావేశంలో ప్రోఫెసర్లు శ్రీనివాస మూర్తి, శైలజా పాల్గొన్నారు.