హైదరాబాద్

బాల్యాన్ని చిదిమేసే చదువులతో ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్: ఆడుతూ, పాడుతూ ఆనందంగా గడపాల్సిన చిన్నారులను చదువుల పేరుతో ఒత్తిడికి గురి చేయడం సరికాదని పలువురు వక్తలు పేర్కొన్నారు. బుధవారం సోమజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ప్రపంచ ఆనంద దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘ఆనందదాయకమైన చదువులు - పిల్లల్లోని అంతర్గత సామర్థ్యాలను వెలికితీయటంలో దాని పాత్ర’ అనే అంశంపై చర్చ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏడ్యుకేషన్ సైకాలజిస్ట్ నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ, డాక్టర్ పరంజ్యోతి, శ్రీనివాస్ రెడ్డి, ప్రముఖ సైకాలజిస్ట్ వీరేందర్, వెంకట్ రెడ్డి హాజరై మాట్లాడారు. చిన్నారులు చదువుల పేరుతో ఒత్తిళ్లతో కూడిన విద్యతో చిన్నారులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ప్రతి సంవత్సరం సుమారు రెండువేల మంది వరకు విద్యార్థుల చదువుల భారంతో మృత్యువాత పడటం విచారకరమని అన్నారు. చదువు అంటే విజ్ఞానంతో పాటు ఆనందాన్ని ఇచ్చే చదువులతో విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతారని చెప్పారు. బాల్యాన్ని జైలుపాలు చేసే విధంగా చదువులు కొనసాగుతున్నాయని జేపీ అన్నారు. కనీసం ప్రాథమిక విద్య వరకేనా చిన్నారులు స్వేచ్ఛయుత వాతావరణంలో నేర్చుకునేలా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. పోటీ పేరుతో విద్యార్థులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నా కనీస పరిజ్ఞానాన్ని సైతం సంపాదించలేక పోతున్నారని వాపోయారు. వందలో 40 మంది విద్యార్థులు రెండు అంకెల తీసివేతను చేయలేక పోతున్నారని, 60 మంది విద్యార్థులు భాగహారాలు చేయలేక పోతున్నారని, మాతృబాషలో చదవలేని విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉన్నాంటే ఆశ్చర్యం కలగక మానదని అన్నారు. నేటి తరం చదువులు విద్యార్థులకు కనీస జీవనానికి తోడ్పడే అంశాలను బోధించలేని పరిస్థితిలో ఉందని తెలిపారు. నైతిక విలువలు లేని విద్యతో సమాజంలో ఎలా మెదగాలో తెలియని విద్యార్థులు చిన్నపాటి సంఘటనలను జీర్ణించుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. నేపథ్యంలో విద్యార్థులకు ఆహ్లాదాన్ని పంచే విధంగా విద్య బోదన సాగాలని, ఆడుతూ అన్ని విషయాలను నేర్చుకునేలా వారిని ప్రోత్సహించాలని కోరారు. దేశినేని వెంకటేశ్వర రావు రచించిన పిల్లలపై చదువుల భారాన్ని తగ్గించడం ఎలా అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.