హైదరాబాద్

ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, : త్వరలో జరగనున్న పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వర్తించే ప్రతి అధికారి, సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్‌ను పంపిణీ చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి దాన కిషోర్ వెల్లడించారు.
గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ఎన్నికల అధికారులు, సిబ్బంది నియామక పత్రంతోనే వారికి పోస్టల్ బ్యాలెట్ ఆప్షన్ ఫారాన్ని అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల ఏర్పాట్లు, వెబ్‌కాస్టింగ్, దివ్యాంగ ఓటర్ల సహాయకారిగా ఉండే వాలెంటీర్లకు సైతం పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తున్నామని వివరించారు. ఎన్నికల ఏర్పాట్లపై ఆయన శుక్రవారం ప్రధాన కార్యాలయంలో నోడల్ అధికారుల సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో ప్రత్యక్షంగా 20వేల మంది అధికారులు, సిబ్బంది పాల్గొంటున్నారని, వీరందరికీ పోస్టల్ బ్యాలెట్ అందించే కార్యక్రమం పురోగతిలో ఉందని వివరించారు. వీటితో పాటు పరోక్షంగా పాల్గొనే జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు వెబ్‌కాస్టింగ్, బీఎల్‌ఓలకు కూడా ఈ సౌకర్యాన్ని కల్పించనున్నట్లు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని ఉపయోగించుకుని అధికారులు, సిబ్బంది కూడా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని, ఓటింగ్ శాతం పెంపునకు కృషి చేయాలని సూచించారు. ఇందుకు సంబంధించి అందరికీ ఎస్‌ఎంఎస్‌లను పంపనున్నట్లు వెల్లడించారు.
ఎన్నికల శిక్షణ కార్యక్రమాలు జరిగే కేంద్రాల వద్ద ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటుచేసి ఈ పోస్టల్ బ్యాలెట్ ఫారాన్ని అందించనున్నట్లు తెలిపారు. అంతేగాక, ప్రత్యేక కాల్ సెంటర్‌ను కూడా అందుబాటులోకి తెస్తామని, పోస్టల్ బ్యాలెట్ పంపిణీ ప్రక్రియను ప్రత్యేకంగా పర్యవేక్షించేందుకు అదనపు కమిషనర్ జయరాజ్ కెనడీని నోడల్ అధికారిగా నియమించినట్లు కమిషనర్ తెలిపారు.
ఈ నెల 25వ తేదీలోగా అన్ని స్ట్రాంగ్ రూంలను సిద్దం చేసి, 26వ తేదీన ఈవీఎంలను ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలకు పంపనున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల సిబ్బందికి ఈ నెల 24వ తేదీలోగా అన్ని రకాల శిక్షణ కార్యక్రమాలను పూర్తి చేయనున్నట్లు తెలిపారు. 26న పీఓ, ఏపీఓల రెండవ ర్యాండమైజేషన్ చేపట్టనున్నట్లు, అదేరోజున ఈవీఎంల తొలి ర్యాండమైజేషన్‌ను చేపట్టి, అదేరోజు రాజకీయ పార్టీల సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి లోక్‌సభ స్థానానికి ఇద్దరు కేంద్ర ఎన్నికల వ్యయ పరిశీలకులు, ఒక సాధారణ పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం నియమించినట్లు ఆయన తెలిపారు.
లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని గణనీయంగా పెంపొందించేందుకు, ఓటర్లలో చైతన్యాన్ని పెంపొందించేందుకు ఇప్పటి వరకు 1250 చునావ్ పాఠశాలలను నిర్వహించినట్లు జిల్లా ఎన్నికల అధికారి దాన కిషోర్ తెలిపారు. వీటితో పాటు మరో 15 కాలేజీల్లో ఓటరు, ఈవీఎం, వీవీ ప్యాట్, సీ-విజిల్‌లపై చైతన్య కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో 24వేల మంది వికలాంగులు పింఛన్లు పొందుతుండగా, వీరిలో 19వేల 326 మంది ఓటర్లుగా నమోదు చేయించామని వివరించారు. ఎన్నికల్లో అక్రమాలను నిరోధించేందుకు 126ఎస్‌ఎఫ్‌టీ, ఎస్‌ఎస్ టీంలతో పాటు 28 ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు బృందాలను ప్రత్యేకంగా నియమించినట్లు తెలిపారు. హైదరాబాద్ నగరంలో 16వేల పైచిలుకు అక్రమ పోస్టర్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించామని, రూ.3.52 లక్షల విలువైన, వెయ్యి 676 లీటర్ల అక్రమ మద్యంను స్వాదీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.