హైదరాబాద్

‘భోగినీ దండకము’ పుస్తకావిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: ప్రముఖ రచయిత డా.సంగనభట్ల నరసయ్య రచించిన ‘భోగిని దండకము’ పుస్తకావిష్కరణ సభ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తేజ ఆర్ట్ క్రియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్ర భారతిలోని సమావేశ మందిరంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు డా.కేవీ రమణాచారి పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. బమ్మెర పోతనామాత్యుడు రచించిన భోగినీ దండకము దండక సాహిత్యంలో విశిష్టమైందని పేర్కొన్నారు. భోగిని దండకము పుస్తకం అందరికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. డా.రంగచార్యులు సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు, ముఖ్యమంత్రి కార్యలయ ప్రత్యేక అధికారి దేశపతి శ్రీనివాస్, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకుడు డా.ద్యావనపల్లి సత్యనారాయణ, ప్రముఖ సాహితీవేత్త డా.గండ్ర లక్ష్మణ రావు, సంస్థ అధ్యక్షుడు డా.పోరెడ్డి రంగయ్య పాల్గొన్నారు.