హైదరాబాద్

ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్: పంజాగుట్ట చౌరస్తాలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడంపై దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం కూడా ఆందోళనలు కొనసాగాయి. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని పంజాగుట్ట ప్రధాన రహదారిపై ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే అనుమతి లేదంటూ తొలగించడంపై మండిపడ్డారు. దళిత సంఘాలకు మద్దతుగా కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంత రావు, రాములు నాయక్ అక్కడికి చేరుకొని నిరసనలో పాల్గొన్నారు. దేశ అభ్యున్నతికి బాటలు వేసిన నాయకుడి విగ్రహాన్ని అవమానకరంగా తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ప్రభుత్వమే అధికారికంగా పంజాగుట్ట సెంటర్‌లో నిలువెత్తు అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.