హైదరాబాద్

హనుమాన్ జయంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్: వాయుపుత్రుని జయంతి వేడుకలను నగరవాసులు అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. వీర హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఖైరతాబాద్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లోని దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరామ భక్తుడైన ఆంజేయుని నిలువెత్తు చిత్రపటాలను ఏర్పాటుచేసి వేడుకలను నిర్వహించారు. పంజాగుట్ట ప్రతాప్‌నగర్‌లో ఎంఆర్‌పీఎస్ యువజన అధ్యక్షుడు నల్ల శివ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు పలువురు పోలీస్ ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ పూజలు నిర్వహించారు.
హనుమాన్ జయంతి సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. శుక్రవారం హనుమాన్ జయంతి రావడంతో పోలీసులు వేడుకలపై ప్రత్యేక దృష్టి సారించారు. వేడుకలు నిర్వహించే వారు ముందస్తు అనుమతులు తీసుకోవాలని సూచించారు. ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలో వేడుకలు జరిపే ప్రాంతాలను ముందే గుర్తించిన పోలీసులు అక్కడ సిబ్బందిని ఏర్పాటు చేశారు.
ఉప్పల్: శ్రీహనుమాన్ జయంతి సందర్భంగా పీర్జాదిగూడ మల్లికార్జున్‌నగర్, అశోక్‌నగర్ అభయాంజనేయ స్వామి దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో కాషాయ ధ్వజ హనుమాన్ శోభాయాత్ర (బైక్ ర్యాలీ)ని నిర్వహించారు. బుద్ధానగర్, భీంరెడ్డినగర్, మారుతీనగర్, లక్ష్మీనగర్‌లోని ఆలయాలను సందర్శించి ధ్వజాలను అధిరోహించారు. కార్యక్రమంలో కమిటీ చైర్మన్ డీ.మధుసూదన్ రెడ్డి, హిందూ దేవాలయ పరిరక్షణ సమితి అధ్యక్షుడు పబ్బోజు శ్రీనివాస్, అక్షయ నిధి సభ్యులు మల్లెల సంతోష్ తదితరులు పాల్గొని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేడిపల్లి, పర్వతాపూర్, చెంగిచర్ల, బోడుప్పల్‌లో హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు.
హనుమాన్ జయంతి సందర్భంగా శుక్రవారం ఉప్పల్ భజరంగ్ ధళ్ ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్రను నిర్వహించారు. పెద్ద మజీదు నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ పుర వీధుల్లో నిర్వహించారు. కళ్యాణపురిలో జరిగిన హనుమాన్ జయంతి వేడుకల్లో కాంగ్రెస్ నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామంతాపూర్, చిల్కానగర్, హబ్సిగూడలో హనుమాన్ శోభాయాత్రను నిర్వహించారు.
వికారాబాద్: హనుమాన్ జయంతి ఉత్సవాలు వికారాబాద్‌లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని హనుమాన్ ఆలయాల్లో, అనంతగిరిలోని బండబావి వీరాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఉదయం 5.30 గంటలకు సుప్రభాత సేవ, 5.45 గంటలకు అభిషేకం, 6.15 గంటలకు పంచామృతాభిషేకం, 7 గంటలకు మహా మంగళహారతి, 10.30 గంటలకు స్వామివారి పల్లకి సేవ, 5 గంటలకు స్వామివారు ఊయల సేవ కార్యక్రమాలను ఆలయ అర్చకులు శేషగిరి పంతులు నిర్వహించారు. పల్లకి సేవలో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ పాల్గొన్నారు.