హైదరాబాద్

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని రంగారెడ్డి కలెక్టర్ లోకేశ్ కుమార్ సూచించారు. గురువారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవాల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్, జెడ్పీ కార్యాలయం, వివిధ ప్రముఖ కార్యాలయాలను విద్యుత్ దీపాలంకరణతో శోభాయమానంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అమరవీరుల స్మారక స్థూపాలను ఏర్పాటు చేసి పుష్పగుచ్ఛాలతో నివాళి సమర్పించాలని సూచించారు. జిల్లాల్లో అన్ని గ్రామాలు, మండల కేంద్రాలు రెవెన్యూ డివిజన్‌లలోనూ, జిల్లా కేంద్రాలలోనూ, మున్సిపాలిటీల్లో, అంగన్‌వాడీ కేంద్రాలలో, ప్రభుత్వ కార్యాలయాలలో జాతీయ పథాకాన్ని ఎగుర వేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని డీఈఓను ఆదేశించారు. మంచినీటి సౌకర్యం, పారిశుద్ధ్యం బాధ్యతలు చేపట్టాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు సూచించారు. ప్రథమ చికిత్స ఓఆర్‌ఎస్ ప్యాకెట్స్, 108, అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. జిల్లా అగ్నిమాపక అధికారికి ఫైరింజన్‌ను అందుబాటులో ఉంచాలని సూచించారు. వివిధ (10) రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి అవార్డులను ప్రదానం చేయనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయుడు, ఉత్తమ, ఉద్యోగి, ఉత్తమ అంగన్ వాడీ వర్కర్, ఉత్తమ సంఘ సేవకుడు, ఎన్‌జీఓ, ఉత్తమ వేద పండిట్, అర్చకుడు, ఉత్తమ సాహితీ వేత్త, కవి, రచయిత, ఉత్తమ కళాకారుడు, ఉత్తమ పారిశ్రామిక వేత్త, ఉత్తమ మండలం, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ, ఉత్తమ సైంటిస్ట్, ఉత్తమ రైతు, ఉత్తమ క్రీడాకారుడు రంగాలలో ఎంపిక చేసి అవార్డులతో సన్మానించనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ జితేందర్ రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ ప్రశాంత్ కుమార్, జిల్లా పరిశ్రమల శాఖాధికారి రాజేశ్వర్ రెడ్డి, డీఈఓ సత్యనారాయణ రెడ్డి, కందుకూర్ ఆర్డీఓ రవిందర్ రెడ్డి పాల్గొన్నారు.
అంబేద్కర్ విగ్రహావిష్కరణ
కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రీసెర్చ్ సెంటర్‌లో జరిగే అంబేద్కర్ విగ్రహావిష్కరణ, ఓయూ సెంట్రల్ లైబ్రరీకి అంబేద్కర్ నామకరణం చేసే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఓయూ ఓఎస్‌డీ ఆచార్య తుమ్మ కృష్ణరావు తెలిపారు. విద్యార్థులు, ఆచార్యులు, మేధావులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. విగ్రహావిష్కరణ, లైబ్రరీకి నామకరణం కార్యక్రమానికి యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ సుక్‌దేవ్ తోరట్ హాజరై అనంతరం ఓయూ దూరవిద్య కేంద్రంలో అంబేద్కర్ అండ్ సోషల్ జస్టిస్ అనే అంశంపై ప్రత్యేక లెక్చర్ కార్యక్రమంలో ప్రసంగించనున్నట్లు ఓఎస్‌డీ కృష్ణారావు పేర్కొన్నారు. పోటీ ప్రపంచంలో ప్రతి కళాశాల తమ ఉన్నతి, పురోగతి కోసం న్యాక్ గుర్తింపు కోసం దరఖాస్తులు చేసుకోవాలని, బెంగుళూరు న్యాక్ డిప్యూటీ అడ్వైజర్ దేవేందర్ కావడే సూచించారు. గురువారం ఓయూ దూరవిద్య కేంద్ర ఆడిటోరియంలో న్యాక్ బెంగుళూరు ఉన్నత విద్యామండలి సహకారంతో ఓయూ ఐక్యూఏసీ ఆధ్వర్యంలో ఒక రోజు న్యాక్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య ఆర్ లింబాద్రి మాట్లాడుతూ ఉన్నత విద్యా మండలి నుండి న్యాకు కోసం దరఖాస్తు చేసుకునే కళాశాలకు శిక్షణ కోసం రూ.లక్ష అందజేస్తామని అన్నారు. ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహించుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఓయూ వీసీ రామచంద్రం మాట్లాడుతూ ఓయూ పరిధిలో ప్రతి కళాశాల న్యాకు గుర్తింపు పొందాలని అన్నారు. కార్యక్రమంలో ఓయూ ఐక్యూఏసీ డైరెక్టర్ ఆచార్య రామల నాగేశ్వర రావు, కోఆర్డినేటర్ సీహెచ్ శ్రీనివాసులు, నోడల్ ఆఫీసర్ ఉపేందర్ పాల్గొన్నారు.