హైదరాబాద్

సుస్థిర నీటి యాజమాన్యంతో రైతుకు మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, విస్తరణ విభాగం రాష్ట్ర స్థాయి సాంకేతిక, కృషి విజ్ఞాన కేంద్రాల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. మూడు రోజుల పాటు రాజేంద్రనగర్‌లోని నీటి సాంకేతిక పరిజ్ఞాన కేంద్రం ఆడిటోరియంలో నిర్వహించే కార్యక్రమాల ప్రారంభోత్సవం విస్తరణ సంచాలకులు డాక్టర్ దండ రాజిరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పరిశోధన సంచాలకులు డాక్టర్ జగదీశ్వర్, అటారి సంచాలకులు డాక్టర్ వైజి ప్రసాద్, వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ విశ్వవిద్యాలయాల అధికారులు డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ విజయ, డాక్టర్ కేసిరెడ్డి, డాక్టర్ ఐ.శ్రీనివాస్ రావు, వ్యవసాయ శాఖ అదనపు సంచాలకులు బాబు నాయక్ హాజరయ్యారు. డాక్టర్ రాజిరెడ్డి మాట్లాడుతూ వివిధ పంటలలో సుస్థిర నీటి యాజమాన్యంపై రైతులలో అవగాహన కల్పించాలని అన్నారు. సాగు ఖర్చులు తగ్గించే నూతన పద్ధతులను రైతులకు అందించాలని సూచించారు. వివిధ పంటలకు విలువ జోడింపు వల్ల అదనపు ఆదాయం పొందేలా రైతులలో అవగాహన తీసుకురావాలని చెప్పారు. వరి, మొక్కజొన్న, పత్తి పంటలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న దోమపోటు, కత్తెర పురుగు, గులాబీ రంగు పురుగు నివారణకు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించుకొని అమలు పరచాలని పేర్కొన్నారు. పరిశోధనా సంచాలకులు డాక్టర్ ఆర్.జగదీశ్వర్ మాట్లాడుతూ విస్తృతమైన విస్తరణ కార్యక్రమాలతో రైతులకు గడిచిన ఏడాదిలో మెరుగైన సేవలను అందించగలిగామని అన్నారు.
పత్తిలో గులాబీ రంగు పురుగు, మొక్క జొన్నలో కత్తెర పురుగు ఉద్ధృతి నివారణ కోసం ఏరువాక కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాల శాస్తవ్రేత్తలు చేసిన కృషి ప్రశంసలను అందుకుందని చెప్పారు. విశ్వవిద్యాలయం పరిశోధకులు రాష్ట్రంలోని కరవు మండలాల గుర్తింపుపై రూపొందించిన నివేదికలు వివిధ జిల్లాల కలెక్టర్ల నుంచి ప్రశంసలు అందుకున్నాయని పేర్కొన్నారు. మొక్కజొన్నలో కత్తెరపురుగు యాజమాన్యంపై కరీంనగర్ ఏరువాక కేంద్రం ప్రచురించిన బులెటిన్‌ను విడుదల చేశారు.