హైదరాబాద్

మత సామరస్యానికి ప్రతికగా రంజాన్ మాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్థలిపురం, ముస్లిం సోదరులు పవిత్రంగా జరుపుకునే రంజాన్ మాసం మతసామస్యానికి ప్రతికగా నిలుస్తుందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. మన్సూరాబాద్‌లోని సిద్దికి ఈ అక్బర్ మసీద్‌లో సహార కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సయ్యద్ జానిమియ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ వింద్‌కు సుధీర్‌రెడ్డి హాజరైనారు. సుధీర్‌రెడ్డి ముస్లిం సొదరులకు రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలిపారు. మజీద్‌లో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, స్థానిక కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు కొప్పుల నర్సింహారెడ్డి, టీఆర్‌ఎస్ నేత జక్కిడి రఘువీర్ రెడ్డిలను శాలువలతో సత్కరించారు. సుధీర్ రెడ్డి మాట్లాడుతూ రంజాన్ మాసాన్ని ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని తెలిపారు. ప్రభుత్వం ముస్లిం సోదరుల సంక్షేమ కోసం అనేక పథకాలను ప్రవేశ పెట్టిందని గుర్తు చేశారు. ఎల్బీనగర్‌లో ఉన్న మజీద్‌ల అభివృద్ధి కోసం తనపూర్తి సహకారాన్ని అందిస్తానని చెప్పారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు యూసూప్, కన్న మహేష్, పీ.జగదీష్ యాదవ్, వల్లపు అరున్ యాదవ్, విజయ్ భాస్కర్ రెడ్డి, బాల్‌రాజు పాల్గొన్నారు.
చేవేళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డిని కలిసిన ఎంబీసీ సంఘం నాయకులు
మేడ్చల్, మే 26: చేవేళ్ల పార్లమెంటు నియోజకవర్గ సభ్యుడిగా విజయం సాధించిన రంజిత్‌రెడ్డిని ఆదివారం వెనుకబడిన తరగతుల(ఎంబీసీ) సంఘం అధ్యక్షుడు జీ.సుధాకర్, యువజన సంఘం అధ్యక్షుడు కటికె వినయ్, గురుచరణ్ తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంపీకి పుష్పగుచ్ఛాన్ని అందజేసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా ప్రకాష్
జీడిమెట్ల, మే 26: జగద్గిరిగుట్ట శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షునిగా పార్శి ప్రకాష్ గుప్త నియమితులయ్యారు. ఆదివారం జగద్గిరిగుట్టలోని ఆర్యవైశ్య సంఘం కార్యాలయంలో సంఘం సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశానికి 230 మంది సభ్యులు విచ్చేసి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. 15 సంవత్సరాల నుంచి సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్న పార్శి ప్రకాష్ గుప్తను మరోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా పబ్బా వెంకటేశ్వర్లు, కోశాధికారిగా తెరాల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా శెర్విరాల కృష్ణమూర్తి, శంకర లింగం, అల్వాల వనజ, సంయుక్త కార్యదర్శులుగా రాంచందర్, రాజయ్య, కిషన్ నియమితులయ్యారు. సంఘం సభ్యులు నూతన అధ్యక్షుడు పార్శి ప్రకాష్ గుప్తను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రకాష్ గుప్త మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా ఏ విధంగా సంఘం అభివృద్ధికి కృషి చేశానో అంతకు రెట్టింపు స్థాయిలో పాటుపడతానని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు గౌరయ్య, కైలాసం, రమేశ్, శంకర్ పాల్గొన్నారు.