హైదరాబాద్

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కేశవ రావు జాదవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రొ.కేశవరావుజాదవ్ అని పలువురు వక్తలు అన్నారు. ప్రొ.కేశవ రావు జాదవ్ ప్రధమ వర్ధంతి సభ తెలంగాణ జన పరిషత్, జాదవ్ అభిమాన సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం రవీంద్ర భారతిలోని సమావేశ మందిరంలో నిర్వహించారు. కార్యక్రమానికి ప్రముఖ పాత్రికేయుడు పాశం యాదగిరి, లోహియా విచార్ మంచ్ ఎ.నారాయణ, దర్శకుడు సయ్యద్ రఫీ, ఉద్యోగ సంఘం నాయకుడు గోపాల్ రెడ్డి, అజాద్ హిందు పరిషత్ ముజిబ్, రిటైర్డ్ జడ్జి గోపాల్ సింగ్, సోషలిస్ట్ నాయకుడు రావిళ్ళ సోమయ్య, తిప్పారెడ్డి, సోషలిస్టు నాయకుడు బాబూరావు పాల్గొని కేశవ రావు జాదవ్ చిత్ర పటానికి నివాళి అర్పించారు. తొలితరం తెలంగాణ ఉద్యమంతో పాటు మల్లిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. విద్యార్థి దశ నుంచే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని తెలిపారు. విద్యార్థి దశ నుంచే సోషలిస్టు సిద్దాంతాన్ని నమ్మి జాతీయ స్థాయికి ఎదిగారని పేర్కొన్నారు.
అలరించిన సినీ సంగీత విభావరి
కాచిగూడ, జూన్ 17: సోల్‌పుల్ మ్యూజిక్ ఈవెంట్స్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో సినీ సంగీత విభావరి సోమవారం గానసభలోని కళావేంకట దీక్షితులు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి పాల్గొని గాయనీ, గాయకులను అభినందించి సత్కారించారు. గాయకుడు భరత్ జసాని నిర్వహణలో బాల మురళి, రవి కిరణ్, వెంకటేశ్ శర్మ అలపించిన గీతాలు అలరించాయి.