హైదరాబాద్

అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదుల వెల్లువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలో మరోసారి అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించేందుకు జీహెచ్‌ఎంసీ ఏ విధానాన్ని అందుబాటులోకి తెచ్చినా, వీటిలో అత్యధిక ఫిర్యాదులు ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలకు చెందినవే ఉండటం గమనార్హం. సోమవారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నాం ఒంటి గంట వరకు నిర్వహించిన ప్రజావాణిలో కమిషనర్, ఇతర అధికారులు మొత్తం 34 ఫిర్యాదులను స్వీకరించారు. దీంతో పాటు ఇప్పటి వరకు మై జీహెచ్‌ఎంసీ యాప్, ట్వీటర్‌ల ద్వారా అందే ఫిర్యాదులపై ప్రతిరోజు సాయంత్రం కల్లా తనకు నివేదికలు సమర్పించాలని ఇప్పటికే ఆదేశాలు జరీ చేసిన కమిషనర్ ప్రతి సోమవారం ప్రజావాణిలో ప్రజల నుంచి స్వీకరించే పిర్యాదులను సకాలంలో పరిష్కరించి నివేదికలను సమర్పించాలని కూడా సూచించారు. సోమవారం స్వీకరించిన 34 ఫిర్యాదుల్లో ఎప్పటిలాగానే అత్యధిక శాతం టౌన్‌ప్లానింగ్‌కు చెందినవే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రోడ్లను అక్రమంగా తవ్వటం, అనుమతుల్లేకుండా నిర్మాణాలు చేపట్టడం, అనుమతులున్నా, దాన్ని ఉల్లంఘించి ఇరుగుపొరుగు వారిని ఇబ్బందులు పాలు చేసేలా నిర్మాణాలు చేపట్టడం, ఆస్తిపన్ను విధింపులో వ్యత్యాసాలు, సవరణ, స్మశానాల్లో వౌలిక వసతుల కల్పన, ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు తదితర అంశాలపై ఈ ఫిర్యాదులను స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. ప్రజావాణిలో కమిషనర్‌తో పాటు అదనపు కమిషనర్లు శృతిఓజా, సిక్తాపట్నాయక్, అద్వైత్‌కుమార్ సింగ్, జయరాజ్ కెనడీ, చీఫ్ ఇంజనీర్లు జియావుద్దిన్, శ్రీ్ధర్ తదితరులు హాజరయ్యారు.