హైదరాబాద్

పవిత్రమైనది వైద్య వృత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: వైద్య వృత్తి ఎంతో పవిత్రమైందని తెలంగాణ నాటక అకాడమి చైర్మెన్ బీ.శివ కుమార్ అన్నారు. డాక్టర్స్ డే సందర్భంగా సృజన జీవిత సాఫల్య పురస్కారంతో పాటు వైద్యులకు ఎక్సలెన్సీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం సృజన సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శివకుమార్ పాల్గొని డాక్టర్ డీ.పద్మనాభణ్‌కు జీవిత సాఫల్య పురస్కాంతో పాటు వైద్యులకు ఎక్సలెన్సీ అవార్డులను ప్రదానం చేశారు. రోగులతో వైద్యలు స్నేహభావంతో మెదగాలని సూచించారు. డాక్టర్ నిరంజన్ రెడ్డి సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్ డా.మంగతాయరూ, సామాజిక వేత్త కమలకర్ రావు, సంస్థ అధ్యక్షురాలు అంజనా చౌదరి పాల్గొన్నారు.