హైదరాబాద్

ఉల్లం‘ఘను’లకు జరిమానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలో నూటికి నూరు శాతం స్వచ్ఛత సాధించటంతో పాటు పరిశుభ్రతను పెంపొందించేందుకు జీహెచ్‌ఎంసీ.. సాఫ్ హైదరాబాద్ - షాన్‌దార్ హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంటే, మరో వైపు స్వచ్ఛ నిబంధనలు, ప్లాస్టిక్ నిషేధాన్ని ఉల్లంఘించిన వారిని గుర్తించి అధికారులు జరిమానాలను విధించే ప్రక్రియను వేగవంతం చేశారు. ఇప్పటి వరకు నగరంలోని 30 సర్కిళ్ల పరిధిలో గతనెల 25వ తేదీ నుంచి ఈ నెల 19వ తేదీ వరకు సుమారు 160 మంది స్వచ్ఛ ఉల్లంఘనుల నుంచి సుమారు రూ.25లక్షల వరకు జరిమానాలు వసూలు చేసినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు వెల్లడించారు. వీటిలో అత్యధికంగా ఉల్లంఘనలు శేరిలింగంపల్లి, చందానగర్ సర్కిళ్లలో గుర్తించారు.
రోడ్డుపై ఎక్కడబడితే అక్కడ చెత్త వేయటం, నాలాలు, చెరువుల్లో ప్లాస్టిక్ కవర్లు వేయటంతో పాటు రోడ్డుపై మురుగునీటిని వదలటం, భవన నిర్మాణ వ్యర్థాలను వేయటం వంటి ఉల్లంఘనలను అధికారులు గుర్తించి, జరిమానాలు వసూలు చేస్తున్నారు. మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలోని మెస్సర్స్ ఇన్నర్ చెఫ్ ప్రైవేట్ లిమిటెడ్ క్యాటరింగ్ రెస్టారెంట్‌కు లక్ష రూపాయల జరిమానాను విధించినట్లు అధికారులు తెలిపారు. తడి, పొడి చెత్తను వేర్వేరు చేసి, ఇచ్చేందుకు సరైన వ్యవస్థను అందుబాటులోకి తెచ్చినా, దాన్ని సవ్యంగా సద్వినియోగం చేసుకోకపోవటం, నిర్లక్ష్యంగా రోడ్లపై పారవేయటం వంటి ఉలంఘనలు చోటుచేసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. నగరవాసుల్లో స్వచ్ఛత, పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు ఎన్ని కార్యక్రమాలను నిర్వహిస్తున్నా, మార్పు రాకపోవటం నగరంలో పరిశుభ్రత పరిరక్షణకు, స్వచ్ఛత పెంపునకు ప్రతికూలమైన పరిస్థితులు తలెత్తటంతో మార్పు తీసుకువచ్చేందుకు జరిమానాలను విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఒకటి, రెండు సార్లు జరిమానాలు విధించిన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాకుండా, ఉల్లంఘనలు పునరావృతమైతే మరింత కఠినంగా వ్యవహారించాలని అధికారులకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
సర్కిళ్ల వారీగా జరిమానాల వివరాలు
చందానగర్‌లో అత్యధికంగా 169 ఉల్లంఘనలకు సంబంధించి సుమారు రూ.7.07లక్షల మేరకు జరిమానాలు వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు. శేరిలింగంపల్లిలో 60 జరిమానాలతో రూ.3.38లక్షలు, జూబ్లీహిల్స్‌లో 125 జరిమానాల నుంచి రూ.1.56లక్షలు, ఖైరతాబాద్ సర్కిల్‌లో 122 జరిమానాలతో రూ.1.76లక్షలు, బేగంపేట సర్కిల్‌లో 73 జరిమానాలతో రూ.89వేలు వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు. నగరంలో అన్ని సర్కిళ్ల కన్నా తక్కువగా గాజుల రామారం సర్కిల్‌లో జరిమానాలను విధించినట్లు అధికారులు వెల్లడించారు.