హైదరాబాద్

హుస్సేన్‌సాగర్ మట్టి విషతుల్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, బేగంపేట ఏప్రిల్ 23: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న సాగర్ ప్రక్షాళన పనులు నగర వాసుల పాలిట శాపంగా మారింది. రాజధాని నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్‌లో పూడికతీతకు అదిలోనే విఘాతం ఏర్పడింది.
పర్యావరణవేత్తల ఆందోళన, ఇతరత్రా సాంకేతిక కారణాల వల్ల పూడికతీత పనులను ప్రారంభించకుండానే వాటిని నిలిపివేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంగా ఇటీవల రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారాకరామారావు అధునాతన యంత్రాలను విదేశాల నుండి తీసుకువచ్చి హుస్సేన్‌సాగర్‌లోని మురికి నీటిని శుద్ది చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగానే మలేషియా నుండి తీసుకువచ్చిన యంత్రంతో ఈ పనులను హుస్సేన్‌సాగర్‌లో చేపడుతున్నారు. సాగర్ మట్టిలో హానికర వ్యర్థాలు ఉన్నాయని దీన్ని ఎక్కడ వేస్తే అక్కడ భుగర్భం విషతుల్యంఅయ్యే ప్రమాదం ఉందని పర్వారణ శాస్తవ్రేత్తలు తెలుపుతున్నారు. దీంతో మురిగినీటితో కాకుండా శుద్ది జలాలతోనే సాగర్‌ను నింపాలని సర్కారు నిర్ణయించండం జరిగింది. ఇందులో భాగంగా తక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. సాగర్ నీటి అవసరాల కోసం క్రీ.పు 1562లో హుస్సేన్ సాగర్‌ను నిర్మించారు. 1884 నుంచి 1930 వరకు స్థానికుల తాగునీటి అవసరాలను తీర్చింది ఈ సాగర్. దీన్ని పరివాహక ప్రాంతం 240 చదరపు కీలోమీటర్లు, 5.7 చదరపు కీలోమీటర్ల మేర నీటి నిల్వలు విస్తరించి ఉండేవి. తరువాత కాలంలో కూకట్‌పల్లి, బంజారా, బల్కాపూర్, పికెట్ నాలాల నుంచి రోజు 370 ఎంజిడీల మురుగు నీరును సాగర్‌లో కలుపడంతో హుస్సేన్‌సాగర్ నీళ్లు పూర్తిగా కలుషితం అయ్యాయి. మురుగునీటిని పూర్తి స్థాయిలో శుద్ధిచేశాకే సాగర్‌లోకి వదలాలని ఉమ్మడి రాష్ట్రంలో ప్రయత్నాలు జరిగాయి. అప్పట్లో హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనకు జపాన్ బ్యాంక్ రుణం రూ.310 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం నిధులు రూ.60కోట్లతో పనులు మొదలు పెట్టారు. బంజారా, బల్కాపూర్, పికెట్ నాలాలు సాగర్‌లో కలిసే గర్భం దగ్గర 10 మీటర్లపై నుంచి పూడిక తీత పనులను రూ.60 కోట్లతో మొదలు పెట్టారు. దాదాపు 8లక్షల క్యూబిక్ మట్టిని తొలగించడం జరిగింది. దానిని గాజుల రామారం డంపింగ్ యార్డుకు తరలించారు. హుస్సేన్ సాగర్‌లో రోజు రోజుకు నీళ్లు ఎండిపోవడంతో నాచుతేతోంది. సాగర్ పరిసర ప్రాంతాలు దుర్గందంగా మారాయి. జంటనగరాల్లో ఒక్కటిగా ఆహ్లదకరమైన ప్రదేశం ట్యాంక్‌బండ్. ఈ ప్రాంతంలో ఉదయం, సాయంత్రం వేళలో కొద్ది సేపు సేద తీసుకోవడానికి వృద్ధులు, మహిళలు, యువకులు ప్రతి రోజు పెద్ద ఎత్తున రావడం జరుగుతోంది. ఇటీవల కాలంలో సాగర్‌లో నీటి మట్టం గణనీయంగా తగ్గిపోవడంతో మురుగు నీరు నాచు తేలడంతో నెక్లెస్ రోడ్డు, ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలలో పెద్ద ఎత్తున దుర్వాసన వెలువడుతోంది. దీంతో ఈ ప్రాంతంలో ప్రయాణించే వారు సైతం ఈ దుర్వాసనను భరించలేక నానాఅవస్థలకు గురవుతున్నారు. ప్రస్తుతం నగరంలో మండుతున్న ఎండలకు గాను సాయంత్రం కొద్దిసేపు సేద తీర్చుకునే వారు ఈ దుర్వాసనతో బెంబేలెత్తి పోతున్నారు. ట్యాంక్‌బండ్ ప్రధాన ద్వారం నుండి లిబర్టీ వరకు ద్విచక్రవాహనాలపై వెళ్లే ప్రయాణికులతో పాటు ఆర్టీసీ బస్‌లలో ప్రయాణించే వారు సైతం ఈ దుర్వాసనతో తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ఈ విషయంపై సాగర్ ప్రక్షాళన పనులు వేగవంతంగా పనులు పూర్తిచేయాలని, ఈ దుర్గంధంనుండి కాపాడాలని నగర ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

తెలుగుజాతి అభ్యున్నతికి
కృషిచేసిన శ్రీపాద
కాచిగూడ, ఏప్రిల్ 23: కథక చక్రవర్తి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్ర్తీ తెలుగుజాతి అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని మొదటి నవలా రచయిత డా.పోరంకి దక్షిణామూర్తి అన్నారు. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్ర్తీ 125వ జయంత్సోత్సవ సభ బాలశ్రీ విద్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్, తెలుగు రథం సంయుక్త ఆధ్వర్యంలో శనివారం రాత్రి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని మినీహాల్‌లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పోరంకి దక్షిణామూర్తి మాట్లాడుతూ శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్ర్తీ రచించిన రచనలు భవిష్యత్ తరాలకు అందుబాటులోకి తీసుకురావాలని పేర్కోన్నారు. ఆయన జీవితం సాహిత్యం కోసమే అంకితం చేశారని కొనియాడారు. తెలుగు కోసం, తెలుగు జాతి అభివృద్ధి కోసం శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్ర్తీ చేసిన సేవలు మరువలేనివని తెలిపారు. అనంతరం మనసు ఫౌండేషన్ అధ్యక్షుడు ఎమ్.వి.రాయుడుకి శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్ర్తీ సాహితీ పురస్కారం ప్రదానం చేశారు.
కార్యక్రమంలో ప్రముఖ రచయిత విమర్శకుడు డా.వేదగిరి రాంబాబు, ప్రముఖ రచయిత్రి కెబి.లక్ష్మీ, సంస్థ అధ్యక్షుడు యనయండ్ర గోపాలకృష్ణ, కొంపెల్లశర్మ పాల్గొన్నారు.
నిందితుల అరెస్టు నిందితుల అరెస్టు