హైదరాబాద్

అజ్ఞానాన్ని తొలగించేవాడే గురువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ : అజ్ఞానాన్ని తొలగించే వాడే గురువు అని పరమహంస పరివ్రాజక శ్రీశ్రీశ్రీ విజ్ఞానానంద భారతీ స్వామి అన్నారు. కళ్యాణానంద భారతీ మంతాచార్య మహాస్వామి రచన తెలుగు అనువాదం ‘బ్రహ్మకలా’ గ్రంథావిష్కరణతో పాటు శ్రీవికారి నామ సంవత్సర ఆషాడ పౌర్ణమి గురు పురస్కారాలు ప్రదానోత్సవ కార్యక్రమం నోరి నరసింహా శాస్ర్తీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విజ్ఞానానంద భారతీ స్వామి పాల్గొని గ్రంథావిష్కరణ చేశారు. గురువులను సత్కరించుకోవడం భారతీయ సంస్కృతిలో భాగమేనని అన్నారు. గురువులలో లౌకిక, ఆధ్యాత్మిక రెండు రకాల గురువులు ఉంటారని పేర్కొన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా గురు పురస్కారాలను ప్రదానం చేయడం అభినందనీయమని అన్నారు. బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మకు (వేదవ్యాస పురస్కారం), బ్రహ్మశ్రీ మున్నంగి వేంకటరాయ శర్మకు (జగద్గురు శ్రీకల్యాణానంద భారతీమంతాచార్య మహాస్వామి పురస్కారం), రాధశ్రీ (కవి సమ్రాట్ నోరి సుబ్రహ్మణ్య సాహిత్య పురస్కారం), డా.వాసా ప్రభావతి (శ్రీముని మాణిక్యం నరసింహా రావు పురస్కారం), ప్రొ.శరత్ జ్యోత్న్సారాణి (డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ పురస్కారం), ప్రొ. ఎన్. వెంకట్రావు( డా.టెర్జాగీ పురస్కారం), సాధన నరసింహా చార్య (తెలుగు తల్లి పురస్కారం), గబ్బిట దుర్గా ప్రసాద్ (కళా సుబ్బారావు పురస్కారం) ప్రదానం చేశారు. పిసుపాటి వెంకటేశ్వర శర్మ నిర్వహించిన ‘్భగవద్గీత బుర్రకథా గానం’ ఆకట్టుకుంది. నోరి నరసింహ శాస్ర్తీ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు బ్రహ్మశ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్ర్తీ సభాధ్యక్షత వహించారు. కార్యక్రమంలో త్రిమ్‌ఫాంట్ ఇన్సిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ పిల్లుట్ల విశ్వనాథ్, ప్రముఖ చరిత్రక నవలా చక్రవర్తి ఆచార్య ముదిగొండ శివప్రసాద్, గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, డా.వారణాసి వేంకటేశ్వర్లు పాల్గొన్నారు.