హైదరాబాద్

బాలిక పెళ్లి విషయంలో నిర్లక్ష్యం వహించిన అధికారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : మైనర్ బాలిక పెళ్లి విషయంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుత రావు డిమాండ్ చేశారు. పెళ్లి వద్దని స్ర్తి శిశు సంక్షేమ శాఖ అధికారులకు మొరపెట్టుకున్నా నిర్లక్ష్యంతో జరిగిన బాల్య వివాహంపై మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా కంది మండలం మేడిపల్లి తాండాకు చెందిన బాలిక తనకు అప్పటికే పెళ్లి అయిన వ్యక్తితో పెళ్లి జరిపిస్తున్నారని స్ర్తి శిశు సంక్షేమ శాఖ అధికారులకు మొరపెట్టుకోగా కేవలం కౌనె్సలింగ్ ఇచ్చి వదిలేశారు.
బాలిక తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేసి కాపురం చేయించడంతో మైనర్ బాలిక గర్భవతి కాగా ఆదివారం అబార్షాన్ చేయించారని ఆరోపించారు. మైనర్ బాలికకు పెళ్లి అవడానికి స్ర్తి శిశు సంక్షేమ శాఖ అధికారుల నిర్లక్ష్యం, నిర్వాకమని పేర్కొంటున్నా బాలల హక్కుల సంఘం.. బాలికను హైదరాబాద్‌లోని ప్రభుత్వ బాలికల గృహంలో చేర్పించి ఆమె విద్యకొనసాగేలా ఏర్పాట చేయడంతో పాటు నిర్లక్ష్యం వహించిన స్ర్తి శిశు సంక్షేమ శాఖ అధికారులను వెంటనే సస్పెండ్ చేసి పోక్సో చట్టం ప్రకారం అరెస్టు చేయాలని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేసింది.