హైదరాబాద్

లష్కర్ బోనాలకు సర్వం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, బేగంపేట : ఆషాఢ మాసంలో తెలంగాణ ప్రజలు ఘనంగా జరుపుకునే బోనాల జాతరలో భాగంగా ఆదివారం సికిందరాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళీ అమ్మవారి బోనాల జాతరకు సర్వం సిద్ధమైంది. ఆదివారం బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని పరిసర ప్రాంతాల్లోని దేవాలయాలను చూడముచ్చటగా ముస్తాబు చేశారు. లష్కర్ పరిసర ప్రాంతాలన్నీ విద్యుత్ కాంతులతో ధగధగలాడుతున్నాయి. ఉజ్జయిని మహంకాళీ బోనాల జాతరకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచే గాక, రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి కూడా లక్షల సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశమున్నందున అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రజలు తమ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా జరుపుకోనున్నారు. బోనాల ఉత్సవాల్లో భాగంగా ఉదయం ఉజ్జయిని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించినానంతరం బోనాల సమర్పణ, దర్శనార్థం భక్తులను అనుమతించనున్నారు. గత సంవత్సరం రికార్డు స్థాయిలో భక్తులు హాజరుకావటంతో సామాన్య భక్తులకు కాస్త ఇబ్బందులు ఎదురైన ఘటనను పరిగణలోకి తీసుకున్న అధికారులు ఈ సారి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మహాంకాళీ అమ్మవారి ఆలయం చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలను కూడా అమలు చేస్తున్నారు. వేలాది మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేయగా, ప్రతి ఒక్కరి కదలికలను గమనించేందుకు వీలుగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ముందు జాగ్రత్తగా మద్యం షాపుల మూసివేత వంటి చర్యలు చేపట్టారు. దీనికి తోడు ఇటు బాటా, ప్యాట్నీ చౌరస్తా, రాంగోపాల్‌పేట, బోట్స్‌క్లబ్ చౌరస్తాల మీదుగా మొత్తం దేవాలయ ఆవరణను పోలీసులు శనివారం రాత్రి నుంచి తమ ఆధీనంలోకి తీసుకున్నారు.