హైదరాబాద్

లష్కర్ కిటకిట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బేగంపేట : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఆదివారం కన్నుల పండువగా సాగింది. లక్షలాది మంది భక్తులు వచ్చి అమ్మవారికి బోనాలు, శాక సమర్పించి చల్లంగా చూడాలని మొక్కుకున్నారు. ఆదివారం తెల్లవారుఝామున 4:10 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు వచ్చి అమ్మవారికి పట్టవస్త్రాలు సమర్పించారు. బోనం, అమ్మవారి మొక్కు కోసం వేలాదిగా బారులు తీరారు. మహంకాళి అమ్మవారిని ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో పాటు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, హైకోర్టు న్యాయమూర్తి అమర్‌నాథ్ గౌడ్, ఎంపీలు రేవంత్ రెడ్డి, రంజిత్ రెడ్డి, బీవీ పాటిల్, ఎస్సీ, బీసీ కమిషన్ల చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, బీఎస్ రాములు, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్యే ముఠా గోపాల్, దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, రామచందర్ రావు, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, రాజ్యసభ మాజీ సభ్యుడు హనుమంత రావు, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, సహాయ కమిషనర్ బాలాజీ, ఈఓ అన్నపూర్ణ వీఐపీలకు ఆహ్వానం పలికి అమ్మవారి దర్శనం చేయించారు.
దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. ఈ ఏడాది బోనాలకు వచ్చే భక్తుల కోసం రెండు క్యూలైన్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు పూర్తిచేసినట్టు చెప్పారు.