హైదరాబాద్

మరో 47 కొత్త పార్కులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : మహానగరంలో రోజురోజుకీ పెరిగిపోతున్న కాలుష్యాన్ని అరికట్టి, పచ్చటి, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పెంపొందించేందుకు జీహెచ్‌ఎంసీ మరోసారి హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. జీహెచ్‌ఎంసీలో ప్రస్తుతమున్న పార్కులతో పాటు మరో 47 కొత్త హరితహరం పార్కులను ఏర్పాటు చేయనున్నారు. ఒక ఎకరం విస్తీర్ణంలో ఒక్కో పార్కును నిర్మించాలని నిర్ణయించారు. వీటికి సంబంధించి ల్యాండ్‌స్కేప్, డిజైన్ల తయారీలో సిద్ధమవుతున్నాయి. వీటితో పాటు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రూ.17.75 కోట్ల వ్యయంతో సూరారం, మాదన్నగూడ, నాదర్‌గుల్ బ్లాక్‌లలో అర్బన్ ఫారెస్టు పార్కుల నిర్మాణానికి చేపట్టారు. ఈసారి హరితహరంలో సుమారు మూడు కోట్ల మొక్కలను నాటాలనే లక్ష్యంతో కార్యక్రమం విజయవంతం చేసేందుకు వీలుగా జోనల్, సర్కిల్ స్థాయిలో ప్రత్యేక కమిటీలను నియమించినట్లు కమిషనర్ వెల్లడించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటాల్సిన ప్రాంతాల ఎంపిక, సంస్థలు, రహదారులు తదితర ప్రదేశాలను గుర్తించటంతో పాటు నాటిన మొక్కలు చక్కగా పెరిగేందుకు వీలుగా నిరంతరం పర్యవేక్షించటమే కమిటీల ప్రధాన విధిగా నిర్ణయించారు. దీనికి తోడు నాటిన మొక్కలను తనిఖీ చేయటంతో పాటు స్థానిక కాలనీ సంక్షేమ సంఘాల, బస్తీ కమిటీలతో సమావేశమై మొక్కలు నాటడం, వాటిని సంరక్షించేందుకు చేపట్టాల్సిన చర్యలపై కార్యచరణను సిద్ధం చేయనున్నాయి. ప్రతి మున్సిపల్ వార్డులో లక్ష్యంగా పెట్టుకున్న 2లక్షల మొక్కలను నాటే అంశంపై, ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసే విషయంపై ఈ కమిటీలు ప్రత్యేకంగా దృష్టి సారించనున్నాయి. ఈసారి హరితహారంలో లక్ష్యంగా పెట్టుకున్న మూడు కోట్ల మొక్కల్లో కోటి మొక్కలు జీహెచ్‌ఎంసీలో అందుబాటులో ఉండగా, మరో కోటిన్నర మొక్కలను జీహెచ్‌ఎంసీ, జలమండలికి చెందిన ఖాళీ స్థలాల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లో పెంచుతున్నారు. మరో 70లక్షల మొక్కలను హెచ్‌ఎండీఏ, హౌజింగ్ బోర్డుకు చెందిన ఖాళీ స్థలాల్లో పెంచుతున్నట్లు అధికారులు తెలిపారు. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోని 3084 ఖాళీ స్థలాలను మొక్కలు నాటేందుకు ఎంపిక చేశారు. ఈ స్థలాల్లోని సుమారు 1729 ఎకరాలు, జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న 873 పార్కుల్లోని 696 ఎకరాల ఖాళీ స్థలాల్లో మొక్కలను నాటనున్నారు. గతంలో హరితహరం నిర్వహించి నాటి మొక్కల్లో చనిపోయిన వాటిని గుర్తించి, వాటి స్థానంలో మళ్లీ మొక్కలను నాటనున్నారు. వీటితో పాటు గ్రేటర్‌లోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర ఖాళీ స్థలాల్లో మొక్కలను నాటేందుకు ఏర్పాట్లు చేశారు.