హైదరాబాద్

బలమైన ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, : బలమైన ఉద్యమాన్ని నిర్మించి ఎస్సీ వర్గీకరణను సాధించుకుందామని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి పిలుపు నిచ్చారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జాతీయ మాదిగ నాయకుల సమావేశం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పిడమర్తి రవి మాట్లాడుతూ వర్గీకరణ అంశాన్ని కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని విమర్శించారు. ఏళ్ల తరబడి ఉద్యమాన్ని కొనసాగిస్తూ మాదిగల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని అన్నారు. కేంద్రం పరిధిలో ఉన్న వర్గీకరణ అంశంపై తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమాలు చేయడం అవివేకమని పేర్కొన్నారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల మధ్య వర్గీకరణ అంశం నాన్చుతున్నాయని అన్నారు. అక్టోబర్ మహాసభను ఏర్పాటు చేసుకొని నవంబర్‌లో ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడదామని అన్నారు. కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన మాదిగ సంఘాల నాయకులు భాస్కర్, వీరయ్య, ఇటుక రాజు, వినాయక్ రావు, మల్లికార్జున్, శ్రీనివాస్, ఉపేందర్, నర్సింహులు, వీరయ్య పాల్గొన్నారు.

టిప్పర్‌ని
ఢీకొట్టిన కారు
గచ్చిబౌలి, ఆగస్టు 16: ఐటీ ఉద్యోగులను జాగ్రత్తగా కార్యాలయాలకు తీసుకుని వెళ్లాల్సిన కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపడంతో నలుగురు ఆసుపత్రి పాలయ్యారు. వేగంగా వచ్చిన జైలో కారు ఆగి ఉన్న టిప్పర్‌ని ఢీకొట్టడంతో డ్రైవర్‌తో పాటు ముగ్గురు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు భవనం వద్ద నిలబడిన సెక్యూరిటీ గార్డుకు గాయపడ్డారు. గచ్చిబౌలిలోని బయోడైవర్సిటీ పార్కు సమీపంలోని మైహో భోజ వద్ద ఆగి ఉన్న టిప్పర్‌ని ఎదురుగా వేగంగా వచ్చిన జైలో కారు ఢీకొట్టింది. సంఘటనలో జైలో ఉన్న ఐటీ ఉద్యోగులు విజయలక్ష్మి(24) తన్వీర్ బేగం(43) సుమన్ (25)తో పాటు జైలో కారు డ్రైవర్ సురేష్(23) మైహో భోజ భవనం వద్ద సెక్యూరిటీ గార్డు విద్యాసాగర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను మాదాపూర్‌లోని మ్యాక్స్ క్యూర్ ఆసుపత్రికి తరలించారు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవీందర్ తెలిపారు.
యురేనియం తవ్వకాలు చేస్తే ఉద్యమం

* రౌండ్‌టేబుల్
సమావేశంలో నేతల హెచ్చరిక
షాద్‌నగర్, ఆగస్టు 16: నల్లమల్ల ప్రాంతంలో యురేనియం తవ్వకాలు చేస్తే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలు చేయనున్నట్లు నేతలు హెచ్చరించారు. శుక్రవారం షాద్‌నగర్‌లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ప్రజా సంఘాల నాయకులు మాడ్లాడుతూ నల్లమల్ల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చేందుకు ప్రయత్నిస్తుందని, దీన్ని ఏమాత్రం సహించేది లేదని అన్నారు. నల్లమల్ల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు చేస్తే ప్రజలు అనారోగ్య సమస్యలతో మృత్యువాత పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ఈ విషయాన్ని ప్రభుత్వం గ్రహించడం లేదని అన్నారు. యురేనియం తవ్వకాలతో జంతువులే కాకుండా ప్రజలు సైతం వివిధ రకాల వ్యాధులతో మృత్యువాత పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. ఖనిజ సంపద కోసం ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే పేద ప్రజలు మాత్రం మృత్యువాత పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే ఉప సంహరించుకోవాలని, లేనిపక్షంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు హెచ్చరించారు. సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు టీజీ శ్రీనివాస్, నర్సింలు గౌడ్, చంద్రారెడ్డి, సత్యం, అర్జునప్ప, రవీంధ్రనాథ్, కృష్ణ, తిరుమలయ్య, శివారెడ్డి, పర్వతాలు, రామ్‌జీ, శ్రీను నాయక్, పవన్ పాల్గొన్నారు.

టిప్పర్ ఢీకొని ఉపాధ్యాయురాలి మృతి
బాలాపూర్, ఆగస్టు 16: ద్విచక్రం వాహనంపై పాఠశాలకు వెళ్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని వెనుక నుంచి టిప్పర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన శుక్రవారం మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బడంగ్‌పేట్ కార్పొరేషన్ ద్వారాక హిల్స్‌లో నివాసం ఉండే రమావత్ లలిత కుమారి(39) ధూల్‌పేట్ ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. భర్త హరికృష్ణ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. స్వగ్రామం నల్లగొండ జిల్లా మర్రిగూడం మండలం సారంపేట్. శుక్రవారం ఉదయం 8:50 గంటలకు లలిత కుమారి పాఠశాలకు తన స్కూటీపై వెళ్తుండగా బడంగ్‌పేట్ ప్రధాన రహదారి కల్లు కంపౌండ్ సమీపంలో టిప్పర్ ఢీకొట్టింది. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
18న సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ
షాద్‌నగర్ రూరల్, ఆగస్టు 16: బహుజన విప్లవ వీరుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ 369వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగస్టు 18వ తేదిన ఫరూఖ్‌నగర్ మండలం కిషన్‌నగర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమానికి షాద్‌నగర్ ఎమ్మెల్యే ఎల్గనమోని అంజయ్య యాదవ్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, సినీనటుడు తల్వార్ సుమన్‌గౌడ్ హాజరవుతున్నట్లు గౌడ సంఘం నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 18వ తేది ఉదయం పది గంటలకు కేశంపేట మండల కేంద్రం నుంచి షాద్‌నగర్ ముఖ్యకూడలి వరకు ర్యాలీ నిర్వహించి కిషన్‌నగర్‌లో విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వివరించారు.
ఓయూలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు
* ఏబీవీపీ నేత శ్రీహరి డిమాండ్
నాచారం, ఆగస్టు 16: ఉస్మానియా యూనివర్సిటీలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసి విద్యార్థులకు రక్షణ కల్పించాలని ఏబీవీపీ గ్రేటర్ కార్యదర్శి పగిడిపల్లి శ్రీహరి డిమాండ్ చేశారు. శుక్రవారం ఓయూలో బాలికల హాస్టల్‌లో భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఇంజనీరింగ్ హాస్టల్ ఎదుట ధర్నా నిర్వహించారు. హాస్టల్‌లోకి దూరిన అగంతకుడు బాలికను కత్తితో బెదిరించి భయబ్రాంతులకు గురి చేసినా అధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓయూ అధ్యక్షుడు సుమన్ శంకర్, రాఘవేందర్, తోట శ్రీను, కమల్, సురేష్, రత్నమాల, మధున, రవళి, వౌనిక పాల్గొన్నారు.
హరితహారాన్ని జయప్రదం చేయాలి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఆగస్టు 16: హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈనెల 17న కిస్మత్‌పూర్‌లోని సివిల్ సప్లై గోదాము ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా పౌర సరఫరాల అధికారి రాథోడ్ ఓ ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వ్యవసాయ, పౌర సరఫరాల శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ పాల్గొంటారని అన్నారు.