హైదరాబాద్

మహా గణపతి ముస్తాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, : ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ మహాగణపతి పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ ఏడాది ద్వదశాదిత్య మహాగణపతిగా
భక్తులకు దర్శనం ఇవ్వనున్న భారీ గణపయ్య నిర్మాణ పనులు రెండు నెలలుగా కొనసాగుతున్నాయి. జూన్ మాసంలో
కర్ర పూజతో ప్రారంభమైన పనులను ఈనెల 18తో పూర్తి
అవుతాయని శిల్పి రాజేందర్ తెలిపారు. 60 అడుగుల ఎత్తులో కొలువుదీరుతున్న మహాగణపతి విగ్రహ నిర్మాణ పనుల్లో 70 మంది శిల్పులు భాగస్వామ్యం కాగా, మొత్తం 150 మంది పనుల్లో పాల్గొన్నారు. గణపతికి ఇరువైపులా విష్ణ్భుగవానుడు, ఏకదశాదేవి, మహేశ్వరులతో కూడిన దుర్గాదేవి విగ్రహాలను అద్భుతంగా తీర్చిదిద్దారు.

అయ్యో పాపం

చెత్తకుప్పలో మృత శిశువు

సనత్‌నగర్, ఆగస్టు 16: చెత్తకుప్పలో రెండు నెలల మృత శిశువు లభ్యమైన సంఘన ఎస్సార్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంగళ్‌రావునగర్ డివిజన్ పరిధిలోని డ్రగ్ కంట్రోల్ కార్యాలయం సమీపంలోని చెత్తకప్పులో రెండు నెలల వయస్సు కలిగిన శిశువు మృతదేహాన్ని గమనించి పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి

వనస్థలిపురం, ఆగస్టు 16: రాజకీయాలకు అతీతంగా ఎల్బీనగర్ అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఏ.రేవంత్ రెడ్డి చెప్పారు. శుక్రవారం వనస్థలిపురం రేణుక ఎల్లమ్మ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నాగోలు డివిజన్‌లోని హరిజన శ్మశాన వాటికలో సమస్యలను పరిశీలించారు. ఫతుల్లాగూడ గ్రామంలోని సర్వేనెంబర్ 58లో నివాసం ఉంటున్న బస్తీలో పర్యటించారు. బస్తీవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 58 సర్వేనెంబర్‌లో నివాసం ఉంటున్న నివాసితులకు పక్కా ఇళ్ల పట్టాలను మంజూరు చేసి వారికి వౌలిక వసతులను కల్పించడానికీ అన్ని శాఖలకు సంబంధించిన అధికారులతో త్వరలో సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని వివిరించారు. మహిళా భవనం నిర్మాణానికి ఎంపీ నిధుల నుంచి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు.
కాంగ్రెస్ నేతను
పరమార్శించిన రేవంత్
ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ధన్‌రాజు అనారోగ్యంతో కొన్ని రోజులుగా ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి శుక్రవారం పరమార్శించారు. టీపీసీసీ కార్యదర్శి జక్కిడి ప్రభాకర్‌రెడ్డి, సీనియర్ నాయకులు కొప్పుల నర్సింహా రెడ్డి, బుడ్డా సత్యనారాయణ, భీమిడి రామకృష్ణా రెడ్డి, బస్తీనాయకులు పెద్ద పెద్దులు, యాదగిరి, బద్రీ, మాధవి, పెద్దులు పాల్గొన్నారు.

8వ కేబుల్ నెట్ ఎక్స్‌పో విజన్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఆగస్టు 16: మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన 8వ కేబుల్ నెట్ ఎక్స్‌పో 2019ను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, అబ్కారీ శాఖ మంత్రి వీ.శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. హెచ్‌ఐసీసీలో డిజిటల్ ఇండియా 8వ కేబుల్ ఎక్స్‌పో విజన్ మూడు రోజుల పాటు కొనసాగుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో టీ-ఫైబర్ సహకారంతో ఎక్స్‌పోను నిర్వహిస్తున్నారు. ఎక్స్‌పోలో 100 స్టాల్స్ ఏర్పాటు చేశారు. టెక్నాలాజీతో ఏర్పాటు చేసిన పరికరాల ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. స్టాల్స్‌ని మంత్రి పరిశీలించారు.