హైదరాబాద్

ట్రాఫిక్ ఆంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : రాష్ట్రానికి సరికొత్త సచివాలయం నిర్మించాలన్న ప్రభుత్వం ప్రతిపాదన మరో అడుగు ముందుకు పడింది. కొత్త సచివాలయాన్ని నిర్మించేందుకు పలు ప్రభుత్వ శాఖలతో తాత్కాలిక సచివాలయంగా కొనసాగనున్న బూర్గుల రామకృష్ణారావు భవన్‌కు నగర ట్రాఫిక్ పోలీసులు పార్కింగ్ వసతిని కల్పించారు. లిబర్టీ చౌరస్తా నుంచి ఆదర్శ్‌నగర్, లక్డీకాపూల్, లుంబినీపార్కు వైపు వచ్చే రహదారిలో ఆంక్షలను శనివారం నుంచి అమలు చేస్తున్నారు. బీఆర్‌కే భవన్‌లో శుక్రవారం నుంచి కొన్ని ప్రభుత్వ శాఖలు శనివారం నుంచి పనిచేయటం ప్రారంభించటంతో అధికారులు, సిబ్బంది, సందర్శకుల వాహనాల పార్కింగ్ కోసం ఈ రోడ్డును కేటాయించారు. లిబర్టీ చౌరస్తా నుంచి ఆదర్శ్‌నగర్ వైపు వచ్చే వాహనాలను అంబేద్కర్ భవన్ సమీపం నుంచి సచివాలయం వైపు మళ్లిస్తున్నారు. ఎప్పటిలాగే తెలుగుతల్లి ఫ్లైఓవర్ కిందనున్న సిగ్నల్ నుంచి బీఆర్‌కే భవన్, జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం వరకు వాహనాలను అనుమతిస్తున్నారు. లిబర్టీ చౌరస్తా నుంచి ఆదర్శ్‌నగర్ చౌరస్తా వరకున్న ఈ రోడ్డులో ఇరువైపులా వాహనాలను పార్కింగ్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఈ రహదారిని మూసివేయటంతో ఈ రోడ్డుపై నిత్యం రాకపోకలు సాగించే వాహనాలు ప్రత్యామ్నాయంగా అంబేద్కర్ విగ్రహం నుంచి ఎడమవైపు మరలి, తెలుగుతల్లి ఫ్లైఓవర్ ఔరస్తా నుంచి ఎడమవైపు మరలి ఆదర్శ్‌నగర్ వెళ్లాల్సి వస్తోంది. ఫలితంగా పరిసర ప్రాంతాలైన ట్యాంక్‌బండ్, లిబర్టీ చౌరస్తాతో పాటు అప్పర్‌ట్యాంక్‌బండ్‌పై కూడా వాహనాల రద్దీ పెరిగింది. ఆంక్షలను శనివారం నుంచే అమలు చేస్తుండటంతో ఈ విషయం లిబర్టీ చౌరస్తా నుంచి సచివాలయం, లుంబినీపార్కు, ఆదర్శ్‌నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌తో పాడు మెడిక్యూర్ ఆసుపత్రికి ఎలా వెళ్లాలో తెలీక అయోమయానికి గురయ్యారు. జీహెచ్‌ఎంసీకి వచ్చే అధికారులు, సిబ్బంది వాహనాలను బీఆర్‌కే భవన్‌ను ఆనుకుని ఉన్న ఎంట్రెన్స్ వద్దకు రాకుండా ఉండేందుకు గాను హైదరాబాద్ నర్సింగ్ హోం ముందున్న మరో ఎంట్రెన్స్‌ను తెరిచారు. ఎపుడైనా కౌన్సిల్ సమావేశం జరిగినపుడు మాత్రమే తెరిచే ఈ ఎంట్రెన్స్ రోజూ తెరిచే ఉంచాలని అధికారులు భావిస్తున్నారు.