హైదరాబాద్

మీకు గుర్తింపు ఇచ్చింది.. టీడీపీని వీడొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : బడుగు, బలహీనవర్గాలకు చట్టసభలో స్థానం కల్పించి, హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన టీడీపీకి అంకితభావంతో పనిచేసే కార్యకర్తలు, ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు, పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఈ విషయాన్ని గుర్తించి, సమాజంలో గుర్తింపునిచ్చిన టీడీపీని వీడొద్దంటూ శ్రేణులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ నగర టీడీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం బుధవారం సిటీ ఆఫీసులో జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిథిగా రావుల చంద్రశేఖర్ రెడ్డి విచ్చేసి మాట్లాడుతూ కొత్త పార్టీలు అధికారంలోకి వచ్చినపుడు అమలుచేసే రకరకాల ఆకర్ష్ స్కీమ్‌లకు ఆకర్షితులై కొందరు నాయకులు అందులో చేరుతున్నారని, ఇది పార్టీకి మామూలేనని వ్యాఖ్యానించారు. రాష్ట్రం కొత్తగా అవతరించినపుడు మిగులు బడ్జెట్ ఉన్నపుడు కూడా ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు చేయటంలో సీఎం కేసీఆర్ ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. ఆరోగ్యశ్రీ పథకం అనేది ప్రభుత్వం ప్రజలకిచ్చిన హక్కు అని, దానికి ఏడాది ఎందుకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించరని ప్రశ్నించారు. సామాన్యుడి ప్రాణాలు గాలిలో కలిసేటంత పరిస్థితులు ఎందుకు వచ్చాయని ప్రశ్నించారు. డబుల్ బెడ్‌రూమ్, ఆరోగ్యశ్రీ అమలు, దళితులకు మూడెకరాల భూమి వంటి అనే వాగ్దాలను అమలు చేయటంలో ప్రభుత్వం వైఫల్యానికి నిరసనగా ఈనెల 26న ఇందిరాపార్కు వద్ధ టీడీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎం.అరవింద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ టీడీపీ పార్టీలో ఉన్న నేతలు, కార్యకర్తల్లో నూటికి తొంభై శాతం బడుగు, బలహీన వర్గాలకు చెందినవారే ఉన్నారని వివరించారు. అరచేతిలో స్వర్గం చూపుతూ సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని విమర్శించారు. నగర నేత పీ.సాయిబాబా మాట్లాడుతూ నగరంలో టీడీపీకి ఏ మాత్రం ప్రజాదరణ తగ్గలేదని, బుధవారం నిర్వహించిన సమావేశానికి హాజరైన కార్యకర్తలు, నేతల సంఖ్యయే నిదర్శనమి అన్నారు. సమావేశానికి బిల్డర్ ప్రవీణ్, ముప్పిడి మధుకర్, నాగూనాగేశ్, గంగాధర్ గౌడ్, కృష్ణగౌడ్, మహిళా నేతలు సూర్యదేవర లత, ఉమా, ఝాన్సీ హాజరయ్యారు.
ప్రజావ్యతిరేక విధానాలపై
పోరాటం ముమ్మరం
పేద, బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలకు సీఎం కేసీఆర్ మాయమాటలు చెబుతూ మోసం చేస్తున్నారని, ఇంటర్మీడియట్ ఫలితాలు, నరుూం కేసు, డ్రగ్స్ కేసు, మియాపూర్ భూ కుంభకోణం వంటివి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రభుత్వం తెరపైకి తెచ్చిందని నగర అధికార ప్రతినిధి నల్లెల్ల కిషోర్ అన్నారు. ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ఈనెల 26న నిర్వహించనున్న నిరసన కార్యక్రమానికి కార్యకర్తలు, నేతలు అధిక సంఖ్యలో తరలివచ్చి, విజయవంతం చేయాలని కోరారు.