హైదరాబాద్

ప్రధాన ఆసుపత్రుల్లో ప్రత్యేక కౌంటర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, : ప్రస్తుత వర్షాకాలం సీజన్‌లో వాతావరణంలో నెలకొన్న మార్పులతో అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు చేపట్టిన ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా నగరంలోని ప్రధాన ఆసుపత్రుల్లో ఫీవర్ టెస్టులు నిర్వహించేందుకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్ వెల్లడించారు. నగరంలోని వివిధ ప్రధాన ఆసుపత్రుల్లో 21 కౌంటర్లను ప్రజలకు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. సీజనల్ వ్యాధుల నివారణ అంశంపై శుక్రవారం ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ దాన కిషోర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నగరంలో 695 హెల్త్‌క్యాంపులను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే రెండు విడతలుగా 1100 హెల్త్‌క్యాంపులను నిర్వహించినట్లు తెలిపారు. మూడో విడతగా 695 హెల్త్‌క్యాంప్‌లను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఫీవర్ ఆసుపత్రిలో 10 ప్రత్యేక కేంద్రాలు, గాంధీ ఆసుపత్రిలో మరో ఆరు, ఉస్మానియా ఆసుపత్రిలో ఐదు ఫీవర్ టెస్టు సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రత్యేక కౌంటర్లలో జనరల్ ఫిజిషీయన్ అందుబాటులో ఉంటా
రని, ఈ కేంద్రాలు సాయంత్రం నాలుగు గంటల వరకు పనిచేయనున్నట్లు వెల్లడించారు. పలు ప్రైవేటు ఆసుపత్రుల నుంచి నిర్థారణ అయిన డెంగీ వివరాల జాబితా వైద్యారోగ్యవాఖకు ఇప్పటికే అందలేదని తెలిపారు. కొన్ని ఆసుపత్రులు ఇప్పటికే పలు పరీక్షలు నిర్వహించి, డెంగీ వ్యాధి ప్రబలినట్లు ప్రకటిస్తున్నాయని తెలిపారు. ప్రధానంగా గత సంవత్సరం అంటువ్యాధులు ప్రబలిన ప్రాంతాలు, బస్తీలు, కాలనీల్లో ఈ హెల్త్‌క్యాంప్‌లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ విభాగం, ఏఎల్‌ఓ టీమ్, జిల్లా మలేరియా హెల్త్ అసిస్టెంట్లు, హెల్త్ సూపర్‌వైజర్లు, వైద్యారోగ్యశాఖకు చెందిన ఆశా, ఏఎన్‌ఎంలతో కూడిన ప్రత్యక కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దోమల నివారణలో భాగంగా ప్రతి ఒక్కరూ శుక్రవారానికి డ్రే డేగా పాటించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.