హైదరాబాద్

రోడ్లపై రయ్..రయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్ : అర్ధరాత్రి వేళ యువత రెచ్చిపోతున్నారు. ఉన్నత వర్గాలకు చెందిన యువతీ యువకులు ఉరకలేసే వయస్సులో ఆధునిక సౌకర్యాలు కలిగిన వాహనాలతో రోడ్లపైకి దూసుకు వస్తున్నారు. అర్ధరాత్రి వేళ తమ హైఎండ్ వెహికిల్స్‌తో రెసింగ్‌లకు పాల్పడుతూ ఇతర వాహనదారులు, పాదాచారుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు. క్షణాల వ్యవధిలో తమ వాహనాలను నిర్ధేశిత ప్రాంతాలకు తీసుకువెళ్తామని బెట్టింగ్‌లకు పాల్పడుతూ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. వాహన తయారీ సంస్థ నిర్ధేశించి వేగాన్ని మించి ప్రయాణిస్తుండటంతో ప్రమాదాల బారిన పడటమే కాకుండా, ఇతరుల ప్రాణాలను సైతం బలిగొనేలా వ్యవహరిస్తున్నారు. దీంతో రాత్రివేళల్లో సాధారణ వాహనదారులు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ రోడ్లపైకి రావాలంటే జంకుతున్నారు. రేసింగ్‌లపై అడపదడపా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నా యువత స్పీడ్‌కు బ్రేకులు వేయలేక పోతున్నారు. వీఐపీలు అధికంగా నివసించే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఈ తంతు సర్వసాధారణంగా మారింది. ఈ తరహా రేసింగ్‌లపై వాహనదారులు, స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసు బాస్‌లు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో శనివారం రాత్రంతా బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో 28 బైక్‌లు, మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు విలేఖరుల సమావేశంలో వివరాలను పంజాగుట్ట ట్రాఫిక్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్(ఏసీపీ) వెల్లడించారు. తమ ప్రాణాలను లెక్కచేయకుండా ఇతరుల ప్రాణాలకు హాని కలిగించేలా రేసింగ్‌లు జరుగుతున్నట్టు ఫిర్యాదులు అందాయని అన్నారు. దీంతో పంజాగుట్ట సబ్ డివిజన్ పరిధిలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట అధికారులు, సిబ్బందిని బృందాలుగా విభజించి తనిఖీలు నిర్వహించినట్టు తెలిపారు. అత్యధిక సీసీ కలిగిన వాహనాలతో పరిమితికి మించి వేగంతో ప్రయాణిస్తున్న వారంతా 20 నుంచి 25 ఏళ్లలోపు యువకులే ఉన్నట్టు తేలిందని అన్నారు. వారి వద్ద నుంచి వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. రేసింగ్‌లకు పాల్పడిన వారి తల్లిదండ్రులను పిలిపించి కౌనె్సలింగ్ ఇచ్చి పంపించి వేస్తామని, మరో సారి దొరికితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు వాహనాలు కొని ఇచ్చే సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.