హైదరాబాద్

తిరుగు ప్రయాణం అవస్థలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికింద్రాబాద్: దసరా పండుగను తమ స్వస్థలంలో జరుపుకునేందుకు అష్టష్టాలు ఊళ్లకు వెళ్లి, బుధవారం తిరిగొచ్చిన నగరవాసులు ఆర్టీసీ సమ్మె కారణంగా అవస్థలెదుర్కొన్నారు. సాధారణంగా సికిందరాబాద్ రైల్వే స్టేషన్‌లో రైలు దిగే ప్రయాణికుల్లో ఎక్కువ మంది ఎదురుగా ఉన్న బస్ స్టేషన్‌లో బస్ ఎక్కి తమ గమ్యస్థానాలకు వెళ్తుంటారు. ఐదు రోజులుగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్నందున, బుధవారం ఈ రకంగా రైలు దిగి బస్సు కోసం స్టేషన్‌కు వచ్చిన ప్రయాణికులకు ఇక్కట్లు తప్పలేదు. బస్సులు అందుబాటులో లేకపోవటంతో ప్రైవేటు వాహానాలను ఆశ్రయించిన ప్రయాణికుల జేబులకు చిల్లు పడింది. వెళ్లేటపుడే గాక, తిరిగి వచ్చే ప్రయాణం కూడా తమకు మరింత ప్రియమైందని కొందరు ప్రయాణికులు వాపోయారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు కుటుంబంతో చేరుకున్న కొందరు నగరవాసులు బస్సు కోసం బస్టాండ్‌లో, బస్టాపుల్లో, బస్సులు అందుబాటులో లేకపోవడం, ఉన్న బస్సులలో విపరీతమైన రద్దీ ఉండడతో అవస్థలు పడ్డారు. ఇదే అదనుగా ఆటో డ్రైవర్లు రెట్టింపు ఛార్జీలను వసూలు చేసుకుని జేబులు నింపుకున్నారు. స్టేషన్‌కు రెండు, మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే ప్రాంతాలకు షేరింగ్ వాహానాలు మామూలు రోజుల్లో పది రూపాయలు వసూలు చేయగా, సమ్మె కారణంగా రూ.20 నుంచి రూ.25 వరకు వసూలు చేస్తున్నారు. ఆటోవాలాలు అడిగినంత ఇచ్చుకుని ఇంటికి చేరాల్సి వచ్చిందని రమేష్ అనే ప్రయాణికుడు వాపోయాడు. తాను నల్గొండ నుంచి బుధవారం రైలులో సికిందరాబాద్ చేరుకున్నామని, తాను హబ్సిగూడకు వెళ్లాల్సి ఉందని, మామూలు రోజుల్లో కేవలం వంద రూపాయలు తీసుకునే ఆటోవాల తనను రూ. 300 డిమాండ్ చేశాడని, చివరకు రూ. 250కి బేరం కుదుర్చుకుని ఇంటికెళ్లాల్సి వచ్చిందని, ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఏర్పాట్లు చేయటంలో సర్కారు ఘోరంగా విఫలమైందని అసహనాన్ని వ్యక్తం చేశారు.

స్మార్ట్ ఆడియో టెక్నాలజీ నుంచి నూతన ఉత్పత్తులు
ఖైరతాబాద్, అక్టోబర్ 9: దీల్లీకి చెందిన స్మార్ట్ ఆడియో టెక్నాలజీ సంస్థ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే నూతన ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చింది. స్మార్ట్ టెక్నాలజీతో పనిచేసే ఫ్లేఫిట్, ఫ్లెగో ఎస్23లను ఆన్‌లైన్ ద్వారా విక్రయాలు జరుపుతున్నట్టు సంస్థ సీఈఓ సందీప్ బంగా ఓ ప్రకటనలో తెలిపారు. నాణ్యమైన ఉత్పత్తులను మధ్యతరగతి వారికి సైతం అందించడం కోసం తమ సంస్థ నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు.