హైదరాబాద్

నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, : ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యం అదేలా చర్యలు తీసుకుంటున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. శుక్రవారం నిమ్స్ ఆసుపత్రిలో రూ.22 కోట్లతో ఏర్పాటు చేసిన అత్యాధునిక స్కానింగ్ యంత్రాలను ఆయన ప్రారంభించారు.
మంత్రి మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల నుంచే కాక వివిధ రాష్ట్రాల నుంచి నిమ్స్‌కు పెద్ద ఎత్తున రోగులు వస్తున్నందున అందుకు తగ్గట్టుగా సౌకర్యాల కల్పనపై దృష్టి సారిస్తున్నట్టు చెప్పారు. దేశంలో క్యాన్సర్ వ్యాధి తీవ్రత నానాటికి పెరుగుతుందని, వ్యాధి సోకిన చాలా కాలానికి వైద్యున్ని సంప్రదిస్తుండటంతో ఖర్చు అధికం అవుతుందని అన్నారు. ప్రస్తుతం నిమ్స్‌లో అందుబాటులోకి తెచ్చిన ఆధునిక యంత్రాలతో క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించే అవకాశం ఏర్పడుతుందని చెప్పారు.
రూ.22 కోట్లతో ఏర్పాటు చేసిన ఈ యంత్రం సహాయంతో అతి తక్కువ ఖర్చుతో వ్యాధినిర్ధారణ పరీక్షలు చేయించుకునే అవకాశం రోగులకు లభిస్తుందని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్ పద్దతిలో పనిచేస్తున్న సెక్యూరిటీ, పారామెడికల్ సిబ్బందికి ప్రతి నెల మొదటి వారంలోనే వేతనాలు అందేలా చర్యలు ప్రారంభించినట్టు చెప్పారు. కార్యక్రమంలో నిమ్స్ డైరెక్టర్ మనోహర్, సూపరింటెండెంట్ నిమ్మ సత్యనారాయణ, వైద్యులు సదాశివుడు, రామ్మూర్తి పాల్గొన్నారు.

విద్యార్థి సంఘాల నేతల అరెస్టు

* తెల్లవారుఝామునే ఇళ్ల వద్దకే
పోలీసులు వెళ్లి స్టేషన్‌కు తరలింపు
* ప్రజాస్వామ్య దేశంలో
సమ్మె హక్కు ప్రజలకు లేదా?
* పోలీసుల తీరుపై నేతల ఆగ్రహం
షాద్‌నగర్ రూరల్, అక్టోబర్ 18: ఆర్టీసీ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మె కారణంగా ఈనెల 19న నిర్వహించనున్న బంద్‌లో భాగంగా ప్రజా సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. శుక్రవారం తెల్లవారుఝామున పట్టణంలోని ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులను ఇళ్ల వద్దనే అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో సమ్మె హక్కు ప్రజలకు లేదా అని ప్రశ్నించారు. శాంతియుత వాతావరణంలో సమ్మె చేస్తుంటే ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఎస్‌ఎఫ్‌ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు ప్రశాంత్, శివశంకర్, టీవీవీ జిల్లా కన్వీనర్ ప్రవీణ్, ఎఐఎస్‌ఎఫ్ నేత పవన్ చౌహాన్, సీపీఐ నేత శ్రీను, జీవిఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీనునాయక్, వినోద్, ఎంఎస్‌ఎఫ్ నేత పెంటనోళ్ళ నర్సింహా మాదిగ ఉన్నారు.

కిడ్నాపర్లకు రిమాండ్
మెహిదీపట్నం, అక్టోబర్ 18: నెల రోజుల క్రితం ఓ వ్యక్తిని కిడ్నాప్‌చేసి అతనిని కొట్టి డబ్బులు లాక్కున్న నిందితులను గోల్కొండ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలను ఇన్‌పెక్టర్ కే.చంద్రశేఖర్ రెడ్డి తెలియజేశారు. టోలిచౌకి ప్రాంతానికి చెందిన ఖలీలోద్దిన్ చెప్పుల వ్యాపారి. వ్యాపారం ముగించుకుని ఇంటికి వస్తుండగా మిత్రులు మహ్మద్ యూసుఫ్, సయ్యద్ నూర్, షేక్ యూసుఫ్‌ద్దిన్, అబ్బాస్ మిర్జా బేగ్, మహ్మద్ రషీద్, జాహిద్, మహ్మద్ తాహేర్ అడ్డగించి కిడ్నాప్ చేసి డబ్బులు లాక్కున్నారు. ఖలీలోద్దిన్ తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ శ్రీనివాస్ దాస్ దర్యాప్తు చేశారు. నిందితులను అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు.