హైదరాబాద్

అలరించిన ‘ఆకాశవాణి సంగీత సమ్మేళనం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: ఆకాశవాణి దేశంలో పలు కేంద్రాలలో ‘అకాశవాణి సంగీత సమ్మేళనం’ నిర్వహిస్తున్నట్లు ఆకాశవాణి డిప్యూటీ డైరెక్టర్ ఎం.శైజల సుమన్ స్పష్టం చేశారు. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు విద్వాస్ అల్లం దుర్గా ప్రసాద్ నిర్వహణలో వాద్య కచేరి అకాశావాణి ఆధ్వర్యంలో శనివారం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శైలజ సుమన్ పాల్గొని జ్యోతి ప్రజ్వాలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి సంవత్సరం 24 కేంద్రాలలో దాదాపు 177 మంది సంగీత విద్వాంసులతో సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం హిందుస్తానీ శాస్ర్తియ సంగీతంలో ఉస్తాద్ అహ్మద్ ఖాన్ గాత్ర కచేరి నిర్వహించారు. వయోలిన్ హెచ్‌కే వెంటకదాసు, మృదంగం విద్వాన్ వీ.కమాలాకర రావు, ఘటం వాళప్పళ్లి ఆర్.కృష్ణ కుమార్ సహకారం అందించారు.