హైదరాబాద్

నగర ట్రాఫిక్‌పై దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నగర ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ కసరత్తును ప్రారంభించింది. ఇందులో భాగంగానే మంత్రి కేటీఆర్ వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. దీర్ఘకాలంలో నగర ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు ప్రణాళికలు, రద్దీ అధికంగా ఉన్న ప్రాంతాలతో పాటు పశ్ఛిమ హైదరాబాద్‌పై దృష్టి, నగరంలో సాద్యమైనా లింక్ రోడ్ల ఏర్పాటు, త్వరితగతిన మిస్సింగ్ లింగ్ లింక్ రోడ్ల నిర్మాణం వంటి అంశాలపై మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, హైదరాబాద్ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ప్రగతిభవన్‌లో జరిగిన ఈ సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ రావు, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్, కమిషనర్ లోకేష్ కుమార్, చీఫ్ సిటీ ప్లానర్లు, చీఫ్ ఇంజనీర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. నగర రోడు నెట్ వర్క్‌ను బలోపేతం చేసేందుకు అవసరమైన రైల్వే వంతెనలు గుర్తించిన రైల్వే శాఖ నుంచి అనుమతులు పొందే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. స్లిప్ రోడ్డులతో పాటు మిస్సింగ్ లింక్‌లను కలిపే చిన్న చిన్న రోడ్ల పనులను వెంటనే ప్రారంభించాలని సంబంధిత అధికారులను మంత్రి అదేశించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం కలిగే మిస్సింగ్ రోడ్ల వివరాలను త్వరగా ఇవ్వాలని కోరిన పురపాలక శాఖకు తెలపాలని ఆ శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ సూచించారు. బోరబండ నుంచి మియాపూర్ వరకు ఉన్న మెయిన్ రోడ్డు నుంచి హైటెక్ సిటీ, మాదాపూర్ దిశగా స్లిప్ రోడ్లను ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీంతో పాటు జూబ్లిహిల్స్ నుంచి నాలెడ్జ్ సిటీ వైపు, ఒల్డ్ ముంబై హైవే వరకు స్లిప్ , నూతన రోడ్లను నిర్మించనున్నారు.